అప్పుడు వారిద్దరూ విడివిడిగా.. ఇప్పుడు కలిసి ఆర్సీబీకి..!

13 Apr, 2021 20:36 IST|Sakshi

ముంబై: గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఆడిన రెండో వన్డేలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఒక భారత అభిమాని మాత్రం తన ఆస్ట్రేలియన్‌ గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసి వార్తల్లో నిలిచాడు.  నవంబర్‌ నెలలో సిడ్నీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌కు వచ్చిన ఒక భారత ఫ్యాన్‌.. ఆస్ట్రేలియా గర్ల్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. రింగ్‌ బాక్స్‌లో నుంచి రింగ్‌ ను  తీసి ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. దానికి ఉబ్బితబ్బైపోయిన ఆమె.. అతని ప్రేమను అంతే హుందాగా అంగీకరించింది. అటు తర్వాత ఇద్దరూ హగ్‌ చేసుకుని తమ ప్రేమను చాటుకున్నారు.  

ఈ ప్రపోజల్‌ నడుస్తున్నంత సేపు కెమెరాలు వారిపైనే ఉన్నాయి. గ్రౌండ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మ్యాక్స్‌వెల్‌ కూడా వీరి ప్రేమను చప్పట్లతో అభినందించాడు. కాగా, అప్పుడు వారిద్దరూ తమ తమ జట్లకు మద్దతిస్తే, ఈ ఐపీఎల్‌  సీజన్‌ ఆరంభమైన తర్వాత వారిద్దరూ కలిసి ఒకే జట్టుకు మద్దతిస్తున్నారు. ఆ జంట ఇప్పుడు ఆర్సీబీకి అభిమానులైపోయారు. వారిద్దరూ ఆర్సీబీ జెర్సీలు వేసుకుని ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పుడు వారిద్దరూ తమ తమ దేశాలకు విడివిడిగా మద్దతిచ్చి ఒక్కటైతే, ఇప్పుడు వారు ఒక్కటిగా ఆర్సీబీని తన ఫేవరెట్‌ టీమ్‌గా ఎంచుకున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు