రాజస్థాన్‌ ఆల్‌రౌండర్‌కు శస్త్రచికిత్స

16 Apr, 2021 19:10 IST|Sakshi

ముంబై: పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడ్డ రాజస్థాన్‌ రాయల్స్‌ అల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు వచ్చే సోమవారం(ఏప్రిల్‌ 19న) శస్త్రచికిత్స జరుగనున్నట్లు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) శుక్రవారం ప్రకటించింది. దీంతో అతను మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంకానున్నాడని ఈసీబీ తెలిపింది. స్టోక్స్‌ ఎడమ చేతి చూపుడు వేలికి ఫ్రాక్చర్‌ అయినట్లు స్కానింగ్‌లో తేలడంతో డాక్టర్లు సర్జరీకి సిఫార్సు చేశారు. దీంతో అతను శనివారం రాజస్థాన్‌ బయో బబుల్‌ను వీడి లీడ్స్‌కు పయనమవుతాడు.

కాగా, స్టోక్స్‌ శస్త్రచికిత్స నిమిత్తం స్వదేశానికి పయనమవుతున్నాడని, దీంతో అతను మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రకటించింది. స్టోక్స్‌.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ కొట్టిన షాట్‌ను డైవ్‌ చేస్తూ అడ్డుకోబోయి గాయం బారిన పడ్డాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో రాజస్తాన్‌‌ 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్టోక్స్‌ పరుగులేమీ చేయకుండానే షమీ బౌలింగ్‌లో వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. కాగా, స్టోక్స్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు 12.5 కోట్లు వెచ్చింది దక్కించుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: మళ్లీ అదే రిపీట్‌ అయితే.. ఈసారి నిషేధమే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు