ముంబై ఇండియన్స్‌ ఇది స్పిన్‌ పిచ్‌.. ఇలా చేయండి

17 Apr, 2021 15:58 IST|Sakshi
Photo Courtesy: BCCI/IPL

చెన్నై:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఈరోజు జరుగునున్న మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌ కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగితే బాగుంటుందని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. ప్రధానంగా భారత క్రికెటర్లే మ్యాచ్‌లో ఎక్కువ ఉండేటట్లు చూసుకోమని చోప్రా సలహా ఇచ్చాడు. నలుగురు విదేశీ క్రికెటర్లు అనే నిబంధనలో వారు పెరగకూడదు కానీ తగ్గినా ఫర్వాలేదని విషయాన్ని ప్రస్తావించాడు. ఈనాటి మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌ను కూర్చోబెట్టి,  స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లాకు అవకాశం ఇస్తే బాగుంటుందన్నాడు. కచ్చితంగా నలుగురు ఓవర్‌సీస్‌ ప్లేయర్లు అవసరం లేని తరుణంలో భారత స్పిన్నర్లకే ఆ అవకాశం ఇవ్వాలన్నాడు. 

చెన్నై పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తున్న క్రమంలో ముంబై కనీసం ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడమే సరైదన్నాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో బుమ్రా, బౌల్ట్‌లు ఉన్న నేపథ్యంలో మూడో ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆప్షన్‌గా హార్దిక్‌ కానీ పొలార్డ్‌ను కానీ ఉపయోంచుకోవాలని సూచించాడు. ఈ ఇద్దరి చేత నాలుగు ఓవర్లు  వేయించినా అప్పుడు లెక్క సరిపోతుందని చోప్రా తెలిపాడు.

ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌లు స్పెషలిస్టు స్పిన్నర్లని, భువనేశ్వర్‌, నటరాజన్‌లు పేస్‌ విభాగంలో ఉన్నారన్నాడు. ఇక ఐదు, ఆరు బౌలింగ్‌ ఆప్షన్లలో అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సామద్‌, విజయ్‌ శంకర్‌లు హైదరాబాద్‌ జట్టులో ఉన్న విషయాన్ని చోప్రా ప్రస్తావించాడు. ఈ రోజు సన్‌రైజర్స్‌ ముజీబ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోతే బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కల్గిన ముంబై ఇండియన్స్‌కు ఆరెంజ్‌ ఆర్మీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. 

ఇక్కడ చదవండి: ‘నువ్వు మంచి బౌలర్‌వి భాయ్‌, కానీ నెక్ట్స్ మ్యాచ్‌ ఆడకు’
సాహోరే చహర్‌ బ్రదర్స్‌.. ఇద్దరూ సేమ్‌ టూ సేమ్‌‌‌‌‌

>
మరిన్ని వార్తలు