ఇదేం కోడ్ నాయనా‌.. ఫ్యాన్స్‌ను కన్‌ఫ్యూజ్‌‌ చేసిన జాఫర్‌

10 Apr, 2021 16:27 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌/ బీసీసీఐ

ముంబై: ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య జరిగిన థ్రిల్లింగ్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఘనంగా ఆరంభమైంది. ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి భోణీ చేసింది. కాగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ కోచ్‌ వసీం జాఫర్‌ ఫ్యాన్స్‌ను కన్‌ఫ్యూజ్‌‌ చేస్తూ తన ట్విటర్‌లో ఒక ఆసక్తికర కామెంట్‌ను పోస్టు చేశాడు. ''ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే మధ్య జరగనుంది. అందులో ఇద్దరు ప్లేయర్లు ఎవరుంటారనేది నేనిచ్చే కోడ్‌లో ఉంది. దానిని డికోడ్‌ చేసే ప్రయత్నం చేయండి. నేను ఈరోజు సాయంత్రం మ్యాచ్‌ ఆరంభానికి ముందు దానిని రివీల్‌ చేస్తాను.. ఆల్‌ ది బెస్ట్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

నెటిజన్లలో చాలా మంది జాఫర్‌ ఇచ్చిన కోడ్‌లో ఒక పేరును మాత్రం చెప్పగలిగారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున పృథ్వీ షా కచ్చితంగా ఉంటాడని.. అయితే సీఎస్‌కే జట్టులో మాత్రం ఎవరు అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. అయితే ఆ రెండో ఆటగాడు బహుశా సామ్‌ కరన్‌ అయి ఉంటాడని చాలా మంది తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది మాత్రం జాఫర్‌ ఇచ్చిన కోడ్‌పై విభిన్నంగా స్పందించారు. ఎలాగు సాయంత్రం చెప్తా అన్నారుగా.. మా బుర్రలు ఎందుకు ఖరాబ్‌ చేసుకోవడం.. అప్పటివరకు ఆగుతాం అంటూ కామెంట్లు చేశారు.

వాస్తవానికి పృథ్వీ షా ఇటీవలే జరిగిన విజయ్‌ హజారే ట్రోపీలో నాలుగు సెంచరీలు సహా మొత్తం 827 పరుగులతో తన ఉద్దేశాన్ని ఘనంగా చాటి చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో అతను కచ్చితంగా ఉంటాడనేది ఇప్పటికే తేలిపోయింది. ఇక సామ్‌ కరన్‌ భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 95నాటౌట్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి అందరి మనసులు గెలుచుకున్నాడు. 
చదవండి: ఐదో స్థానంలో ఏబీడీ: యువీ ట్వీట్‌.. కోహ్లి ఏమన్నాడంటే!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు