IPL 2021: సీఎస్‌కేకు ఎదురుదెబ్బ

1 Apr, 2021 09:26 IST|Sakshi

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక్కొక్కరూ ఈ లీగ్ నుంచి తప్పుకుంటున్నారు. బయో బబుల్‌లో రెండు నెలల పాటు గడపడం ఇష్టం లేదంటూ సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరం కాగా ఈ లిస్టులో మరో ఆసీస్ ప్లేయర్ కూడా చేరాడు. బయో బబుల్‌లో గడపడం ఇబ్బందిగా ఉందంటూ ఆసీస్ పేసర్ జోష్ హజిల్‌వుడ్, ఈ సంవత్సరం లీగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో సీజన్‌ 14 ప్రారంభానికి ముందే చెన్నైసూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది.

మాకు విశ్రాంతి అవసరం
‘దాదాపు 10 నెలల నుంచి బయో బబుల్‌, క్వారంటైన్‌లోనే జీవితాన్ని గడుపుతున్నాను.  ఐపీఎల్ తర్వాత కూడా బిజీ క్రికెట్ షెడ్యూల్లో ఆడబోతున్నాం. గత సంవత్సర కాలంగా విశ్రాంతి లేకుండా ఒక సిరీస్‌ నుంచి మరొక సిరీస్‌ ఆడుతూనే ఉన్నాము. దీని కారణంగా మానసికంగా, శారీరకంగా అలసటగా భావిస్తున్నాను. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుని కుటుంబంతో గడపాలని అనుకుంటున్నా’ అని  హజిల్‌వుడ్ చెప్పాడు. ఐపిఎల్ 2020 వేలంలో హాజల్‌వుడ్‌ను చెన్నై యాజమాన్యం 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో 3 మ్యాచులు ఆడిన జోష్ హాజల్‌వుడ్, ఒకే ఒక్క వికెట్ తీశాడు.

2021 వేలానికి ముందు ఎంఎస్ ధోని ఇతడిని రిటైన్‌ ఆటగాళ్ల జాబితాలో చేర్చి జట్టులోనే పెట్టుకున్నాడు. ప్రస్తుతం లీగ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన ఈ పేసర్ నిర్ణయం నిస్సందేహంగా సూపర్ కింగ్స్‌ను ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ 14 నుంచి జోష్ హాజల్‌వుడ్, మిచెల్ మార్ష్, జోష్ ఫిలిప్ మొత్తం ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్ళు వైదొలిగారు. ( చదవండి: కెప్టెన్లు జర భద్రం...లేదంటే భారీ మూల్యం

మరిన్ని వార్తలు