'పో.. పో.. ఫోర్‌ వెళ్లు' అంటూ పొలార్డ్‌.. నోరెళ్లబెట్టిన మోరిస్‌

29 Apr, 2021 20:01 IST|Sakshi
Courtesy : IPL T20. Com

అహ్మదాబాద్‌: పవర్‌ హిట్టింగ్‌కు మారు పేరుగా ఉండే కీరన్‌ పొలార్డ్‌  ఎంటర్‌టైన్‌ అందించడంలోనూ అంతే ముందుంటాడు. ఒక్కోసారి తన​ చర్యలు నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్‌ ఇచ్చిన ఒక ఎక్స్‌ప్రెషన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. ముంబై ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ను క్రిస్‌ మోరిస్‌ వేశాడు. ఆ ఓవర్‌ మూడో బంతి పొలార్డ్‌ ఆడే ప్రయత్నం చేయగా.. వేగంగా వచ్చిన బంతి అతని హెల్మెట్‌కు బలంగా తాకి బౌండరీ వైపు పరుగులు తీసింది.  దీంతో పొలార్డ్‌ వెనుకకు తిరిగి పో.. పో.. బౌండరీ వెళ్లు.. అంటూ చేతులను ఊపాడు.. తీరా బంతి బౌండరీ దాటడం.. లెగ్‌ బై రూపంలో పరుగుల వచ్చాయి. అయితే ఇది ఊహించని మోరిస్‌ మాత్రం షాక్‌ తిని నోరెళ్లబెట్టాడు. ఆ తర్వాత పొలార్డ్‌ మోరిస్‌ దగ్గరకు వచ్చి మోరిస్‌.. నువ్వు ఇది ఊహించి ఉండవు అంటూ పేర్కొన్నాడు. పొలార్డ్‌ చర్యలు నవ్వు తెప్పించే విధంగా ఉండడంతో నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్లు చేశారు.


Courtesy: IPL T20.Com
ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. డికాక్‌ 70 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కృనాల్‌ 39 పరుగులతో అతనికి సహకరించాడు. రాజస్తాన్‌ బౌలర్లలో మోరిస్‌ 2, ముస్తాఫిజుర్‌ 1 వికెట్‌ తీశాడు.  అంతకముందు రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత  20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్‌ 42 పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్‌ 41, దూబే 35, జైస్వాల్‌ 32 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చహర్‌ 2, బుమ్రా, బౌల్ట్‌లు చెరో వికెట్‌ తీశారు.
చదవండి: 'చహర్‌ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్‌ను చూడు'

మరిన్ని వార్తలు