కేకేఆర్‌ చెత్త రికార్డు.. ఏడుగురు ఆటగాళ్లు ఆ తరహాలో

29 Apr, 2021 21:08 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్ తన పేరిట ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌ ఆటగాళ్లలో ఏడుగురు వివిధ సందర్బాల్లో గోల్డెన్‌ లేదా డైమండ్‌ డక్‌గా వెనుదిరగడం విశేషం. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయిన నరైన్‌ ఈ సీజన్‌లో కేకేఆర్‌ తరపున గోల్డెన్‌ లేదా డైమండ్‌ డక్‌ అయిన ఏడో ఆటగాడిగా నిలిచాడు.

ఈ సీజన్‌ మొదటి నుంచి చూసుకుంటే గోల్డెన్‌ డక్‌  లేదా డైమండ్‌ డక్‌ అయిన కేకేఆర్‌ జాబితా చూసుకుంటే.. నితీష్‌ రానా, శుబ్‌మన్‌ గిల్‌, ఇయాన్‌ మోర్గాన్‌, సునీల్‌ నరైన్‌, పాట్‌ కమిన్స్‌, వరెణ్‌ చక్రవర్తి, ప్రసిధ్‌ కృష్ణ ఉన్నారు. ఇందులో ఇయాన్‌ మోర్గాన్‌  డైమండ్‌ డక్‌గా వెనుదిరగ్గా.. మిగిలిన వారు  గోల్డెన్‌ డక్‌ అయ్యారు. ఒక బంతి ఆడకుండానే బ్యాట్స్‌మన్‌ ఔటైతే దానిని డైమండ్‌ డక్‌ అంటారు.. అలాగే ఆడిన మొదటి బంతికి ఔట్‌ అయితే దానిని గోల్డెన్‌ డక్‌గా పరిగణిస్తారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ తడబడుతుంది. 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రసెల్‌ 7, కార్తీక్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.   
చదవండి: 'పో.. పో.. ఫోర్‌ వెళ్లు' అంటూ పొలార్డ్‌.. నోరెళ్లబెట్టిన మోరిస్‌

మరిన్ని వార్తలు