వారెవ్వా జేమిసన్‌.. దెబ్బకు బ్యాట్‌ విరిగింది

9 Apr, 2021 21:38 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌ వెబ్‌సైట్‌

చెన్నై: చెపాక్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ను కైల్‌ జేమిసన్‌ వేయగా..  పొలార్డ్‌, కృనాల్‌ క్రీజులో ఉన్నారు. కాగా 19వ ఓవర్‌ మూడో బంతిని జేమిసన్‌ యార్కర్‌ వేశాడు. దానిని ఎదుర్కోవడంలో కృనాల్‌ విఫలం కాగా.. బంతి బ్యాట్‌ను బలంగా తాకింది. దీంతో దెబ్బకు బ్యాట్‌కున్న హ్యాండిల్‌ హుక్‌ ఊడి బయటకొచ్చింది. దీనిని చూసి కృనాల్‌ మొదట షాక్‌ అయినా.. ఆ తర్వాత రెండు ముక్కలైన తన బ్యాట్‌ను చూసి నవ్వుకున్నాడు.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ''వారెవ్వా జేమిసన్‌.. దెబ్బకు బ్యాట్‌ విరిగింది.. బుల్లెట్‌ లాంటి బంతికి కృనాల్‌ దగ్గర సమాధానం లేకుండా పోయింది'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్‌లో లిన్‌ 49 పరుగులతో రాణించగా.. మిగతావారు విఫలం అయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. సుందర్‌, జేమిసన్‌ తలా ఒక వికెట్‌ తీశారు. 
చదవండి: ఒక ఓపెనర్‌కు రెస్ట్‌.. మరొక ఓపెనర్‌ క్వారంటైన్‌లో
కోహ్లి మెరుపు ఫీల్డింగ్‌.. రోహిత్‌ రనౌట్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు