పుజారా ఆటపై నాకు అనుమానాలున్నాయ్‌!

9 Apr, 2021 15:36 IST|Sakshi
చతేశ్వర్‌ పుజారా(ఫోటో సోర్స్‌-పుజారా ట్విటర్‌ అకౌంట్‌‌)

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు చతేశ్వర్‌ పుజారా. సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌ ఆడుతున్నాడు పుజారా. ఇది పుజారాకు సదావకాశమనే చెప్పాలి. కేవలం టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిన పుజారా.. ఈ సీజన్‌లో సత్తాచాటి తాను కూడా టీ20 ఫార్మాట్‌కు సరిపోతాననే సంకేతాలిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే విషయాన్ని పుజారా చాలాసార్లు చెప్పాడు కూడా. తనను టెస్టు ప్లేయర్‌గా మాత్రమే చూస్తున్నారని, టీ20 తరహా దూకుడైన ఆటకు కూడా తాను సరిపోతానని పలుమార్లు విన్నవించుకున్న తర్వాత సీఎస్‌కే అతన్ని కొనుగోలు చేయడం ఒక మంచి పరిణామం.

కాగా, ఈ ఐపీఎల్‌లో  పుజారా ఎలా ఆడబోతాడు అనే దానిపై అటు ప్రేక్షకులు, ఇటు మాజీ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అందుకు కారణం  లేకపోలేదు. ఇప్పటివరకూ 30 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన పుజారా కేవలం 390 పరుగులు మాత్రమే చేశాడు.  ఇక్కడ అతని యావరేజ్‌ 21.0 కంటే తక్కువగా ఉంది. ఇదే అనుమానాలు రేకెత్తిస్తోంది. తాజాగా ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌  బౌలర్‌ బ్రెట్‌ లీ కూడా పుజారా ఆటపై ఆసక్తిని ప్రదర్శిస్తూ అనుమానాలు వ్యక్తం చేశాడు.

‘చూద్దాం.. ఈ ఐపీఎల్‌లో పుజారా ఎంతవరకు రాణిస్తాడో చూడాలని ఉంది. టీ20 ఫార్మాట్‌లో పుజారా మెరుగ్గా రాణిస్తాడా అనేది నేను కచ్చితంగా చెప్పలేను. పుజారా ఒక గొప్ప బ్యాట్స్‌మన్‌.. కానీ పొట్టి ఫార్మాట్‌లో పుజారా ఆటపై నాకు అనుమానాలున్నాయ్‌.  సాధ్యమైనంత త్వరంగా పరుగులు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు. నేను బ్రెట్‌ లీ పెద్ద ఫ్యాన్‌. ఈ ఫార్మాట్‌లో పుజారా ఏం చేస్తాడో చూడాలి’ అని బ్రెట్‌ లీ పేర్కొన్నాడు. శనివారం ముంబై వాంఖడే స్టేడియంలో సీఎస్‌కేతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. 

ఇక్కడ చదవండి: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. నాకు నమ్మకం ఉంది!

సీఎస్‌కేతో ఆసీస్‌ పేసర్‌ ఒప్పందం

మరిన్ని వార్తలు