త్వరలోనే ఆయన జట్టుతో చేరతారు: ముంబై ఇండియన్స్‌

22 Apr, 2021 10:59 IST|Sakshi
Photo Courtesy: Mumbai Indians Twitter

ముంబై: భారత క్రికెట్‌ జట్టు మాజీ వికెట్‌ కీపర్, ముంబై ఇండియన్స్‌ జట్టు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌ కిరణ్‌ మోరే కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 58 ఏళ్ల మోరే ఈనెల 6న కోవిడ్‌–19 బారిన పడ్డారు. దాంతో ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన మూడు వరుస ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలలో నెగెటివ్‌ ఫలితం వచ్చింది. త్వరలోనే మోరే జట్టుతో మోరే చేరుతాడని ముంబై ఇండియన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు