వైరల్‌: సూర్యకుమార్‌కు భార్య మీద ఎంత ప్రేమో!

30 Apr, 2021 13:28 IST|Sakshi

న్యూఢిల్లీ: రెండు వరుస పరాజయాల తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్‌ సేన సంబరాల్లో మునిగిపోయింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా స్థాయికి తగిన ప్రదర్శన చేసి తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకుంది. ఈ క్రమంలో, మ్యాచ్‌ విజయానంతరం ముంబై ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ సంతోషాన్ని తన భార్య దేవిషా శెట్టితో పంచుకున్నాడు. ఆట ముగియగానే స్టేడియంలో ఉన్న దేవిష ఒక్కసారిగా గాజుతెర వద్దకు రాగా, సూర్య ఆమెను ఆత్మీయంగా ముద్దుపెట్టుకున్నాడు. 

ఇందుకు సంబంధించిన ఫొటోను టీమిండియా మాజీ క్రికెటర్‌, ముంబై ఇండియన్స్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జహీర్‌ ఖాన్‌ సతీమణి, నటి సాగరిక ఘట్కే  తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు. ఈ క్రమంలో సూర్యకుమార్‌కు భార్య మీద ఎంత ప్రేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక గురువారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. క్వింటన్‌ డికాక్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీ(70)తో ఆకట్టుకోగా, కృనాల్‌ పాండ్యా(39) మెరుగ్గా రాణించాడు. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ 10 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు.

చదవండి: పృథ్వీ షా మెడపట్టి నొక్కి.. శివం మావి స్వీట్‌ రివేంజ్‌!

స్కోర్లు: రాజస్తాన్‌ రాయల్స్‌- 171/4 (20)
ముంబై ఇండియన్స్‌- 172/3 (18.3)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు