మాల్దీవులకు పారిపోయిన కామెంటేటర్‌

3 May, 2021 17:29 IST|Sakshi

ఢిల్లీ:  ప్రస్తుత ఐపీఎల్‌లో బయోబబుల్‌ను విదేశీ క్రికెటర్లు అసలు భరించలేకపోతున్నారు. ఎక్కడికి కదలకుండా ఒకే ప్లేస్‌లో ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఉండటాన్ని వారికి కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు ఐపీఎల్‌ను అర్థాంతరంగా వీడి తమ దేశాలకు వెళ్లిపోయారు.  భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉండటం కూడా వీరిని భయభ్రాంతులకు  గురి చేస్తోంది. ఇలా చిక్కుకపోవడం వారికి మింగుడు పడటం లేదు.

మరొకవైపు భారత్‌ నుంచి విమానరాకపోకలను పలుదేశాలు నిషేధం విధించడంతో ఐపీఎల్‌లో ఉన్న విదేశీ క్రికెటర్లు  చేసేది ఏమీ లేకుండా పోయింది. కాగా, ఐపీఎల్‌లో కామెంటరీ ఒప్పందాన్ని కుదుర‍్చుకున్న ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ స్లేటర్‌ బయోబబుల్‌ నిబంధనను  అతిక్రమించాడు. కొన్ని రోజుల నుంచి కామెంటరీ ప్యానల్‌ కనిపించన స్లేటర్‌ మాల్దీవులకు పారిపోయినట్లు తెలుస్తోంది. భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతోనే మాల్దీవుల మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది విదేశీ క్రికెటర్లు కూడా అదే రూట్‌ను ఎంచుకుని బయోబబుల్‌ నుంచి ఎస్కేప్‌ కావడానికి యత్నాలు ఆరంభించినట్లు సమాచారం. 

ఇక్కడ చదవండి: సీఎస్‌కే క్యాంప్‌లోనూ కరోనా కలకలం..!
‘ఇకపై వార్నర్‌ను సన్‌రైజర్స్‌ జెర్సీలో చూడలేం’

మరిన్ని వార్తలు