తస్లీమాపై పరువు దావా నష్టం వేయనున్న మొయిన్‌ అలీ

7 Apr, 2021 12:00 IST|Sakshi

ముంబై: వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌‌ మొయిన్‌ అలీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  ''మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్‌ ఉగ్రవాద సంస్థలో చేరేవాడంటూ'' ట్విటర్‌లో సంచలన కామెంట్స్ చేసింది. తస్లీమా వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మొయిన్‌ అలీపై తస్లీమా చేసిన వ్యాఖ్యలపై పలువురు క్రికెటర్లతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ క్రికెటర్లు జోప్రా ఆర్చర్, శామ్ బిల్లింగ్స్‌తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా మొయిన్ అలీకి మద్దతుగా నిలుస్తూ ఆమెను ఉతికారేశారు.

తాజాగా తస్లీమా నస్రీన్‌ వ్యాఖ్యలపై మొయిన్‌ అలీ పరువు నష్టం దావా వేయనున్నట్లు సమాచారం. ''మొయిన్‌ అలీపై తస్లీమా నస్రీన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఆమె  వ్యాఖ్యలు అలీ పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని.. అందుకే లీగల్‌ పద్దతిలో మా లాయర్‌తో చర్చించి కోర్టును ఆశ్రయించనున్నాం. ఒక వ్యక్తిని కించపరిచేలా మాట్లాడినందుకు తస్లీమాపై పరువు నష్టం దావా వేయనున్నాం.''అంటూ అలీ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎసెస్‌ మిడిల్‌ ఈస్ట్‌ తన ట్విటర్‌లో రాసుకొచ్చింది.

అయితే మొయిన్‌ అలీ తస్లీమా వ్యాఖ్యలపై స్పందించలేదు.. అయితే ఈ విషయాన్ని తన మేనేజ్‌మెంట్‌ చూసుకుంటుందని అలీ భావించి ఉంటాడని సమాచారం. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మెయిన్‌ అలీ సీఎస్‌కేకు ఆడనున్న సంగతి తెలిసిందే. కాగా వేలంలో సీఎస్‌కే అలీని రూ.7 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సీఎస్‌కే ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్10న ముంబై వేదికగా ‌ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

చదవండి: ‘అతను క్రికెటర్‌ కాకపోయుంటే టెర్రరిస్ట్‌ అయ్యేవాడు

ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్‌కే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు