ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్‌కే

4 Apr, 2021 14:21 IST|Sakshi

ముంబై: ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీని  రూ. 7కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొయిన్‌ అలీ స్వతహాగా ఆల్కహాల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న జెర్సీలను ధరించడానికి ఇష్టపడడు. అటువంటి జెర్సీలను తాను వేసుకోనని ఇంతకముందు చాలాసార్లు తేల్చి చెప్పాడు. ఈ నేపథ్యంలోనే అది ఇంగ్లండ్‌ తరపున లేదా ఇతర డమొస్టిక్‌ క్రికెట్‌ ఏది ఆడినా సరే అతను వేసుకొనే జెర్సీపై ఆల్కహాల్‌కు సంబంధించిన లోగోను లేకుండా చూసుకునేవాడు.

తాజాగా సీఎస్‌కే జెర్సీపై ఎస్‌ఎన్‌జె 10000 లోగో ఉండడం గమనించే ఉంటాం. దీంతో ఆల్కహాల్‌ లోగో ఉన్న జెర్సీని తాను వేసుకోలేనని.. ప్లెయిన్‌ జెర్సీని వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ అలీ సీఎస్‌కేను కోరాడు.కాగా అలీ ప్రతిపాదనకు సీఎస్‌కే ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అతను వేసుకొనే జెర్సీపై ఆ లోగోను తొలగించనున్నట్లు సీఎస్‌కే స్పష్టం చేసింది.ఇంతకముందు మొయిన్‌ అలీ ఆర్‌సీబీకి ఆడినప్పుడు కూడా ఆల్కహాల్‌ లోగో లేని జెర్సీనే ధరించి ఆడాడు. కాగా మొయిన్‌ అలీ ఇప్పటివరకు 19 మ్యాచ్‌లాడి 309 పరుగులు.. 10 వికెట్లు తీశాడు.  ధోని సారధ్యంలోని సీఎస్‌కేకు ఆడేందుకు తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు అలీ ఇటీవలే చెప్పుకొచ్చాడు.
చదవండి: 
'అతన్ని చూస్తే బాధేస్తోంది.. ఐపీఎల్‌ ఆడితే బాగుండేది'

'మేం సీఎస్‌కేకు ఆడలేం'.. కారణం అదేనట

మరిన్ని వార్తలు