బయట భయంకర పరిస్థితులే ఉన్నాయి: మోర్గాన్‌

27 Apr, 2021 15:59 IST|Sakshi
Photo Courtesy: PTI/BCCI

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ మళ్లీ విజృంభించడంతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భయంకర పరిస్థితులున్నాయని కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన​ అన్నాడు. తాము బయోబబుల్‌ వాతావరణంలో ఉన్నామని, బయట మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నాడు. దీనికి తమ వంతు సహకారాన్ని, మద్దతును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. ఎవరైనా బయటకు వెళుతుంటే సురక్షితంగా ఉండటానికి మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమన్నాడు. ఈ కరోనా వైరస్‌ను మొదటిసారి చూసినప్పుడు ఎంత వినాశనాన్ని సృష్టించిందో అందరికీ తెలుసన్నాడు. అంతిమంగా ఒకేతాటిపై ఉండి దీనిపై పోరాడాల్సిన సమయం ఇదన్నాడు.

పంజాబ్‌ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో విజయం తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన మోర్గాన్‌.. బయోబబుల్‌ను దాటి బయట పరిస్థితులు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితే ఉందన్నాడు. ఇక మ్యాచ్‌లో విజయం సాదించడంపై మాట్లాడుతూ..‘ విజయాలు అంత సులువుగా రావడం లేదు. మా వాళ్లు చాలా కష్టపడ్డారు. కొంచెం అదృష్టంతో పాటు బంతితో పంజాబ్‌ కింగ్స్‌న కట్టడి చేసిన తీరు బాగుంది. ఇక ఈ సీజన్‌లో రెండో మ్యాచ్‌ ఆడుతున్న శివం మావి.. చివర్లో బాగా బౌలింగ్‌ చేశాడు. అలాగే ఆరంభంలో కూడా మావి ఆకట్టుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది’ అని తెలిపాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు