కెప్టెన్‌గా ధోని.. ఓపెనర్లుగా రోహిత్‌, గేల్‌

8 Apr, 2021 16:56 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవెన్‌ టీమ్‌ని ప్రకటించాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. టోర్నీలో ఇది 14వ సీజన్. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో గవాస్కర్ తన టీమ్‌ని ప్రకటించాడు. ఈ టీమ్‌కి కెప్టెన్, వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోనీ ఎంపికయ్యాడు.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, క్రిస్‌గేల్‌ని ఎంపిక చేసిన సునీల్ గవాస్కర్.. డేవిడ్ వార్నర్‌ని మూడో స్థానానికి ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో.. గత సీజన్‌కు దూరంగా ఉన్న సురేశ్‌ రైనాను ఐదో స్థానం కల్పించాడు. మ్యాచ్‌ ఫినిషర్స్‌గా ఏబీ డివిలియర్స్‌, మహేంద్రసింగ్ ధోనిని ఎంపిక చేసిన గవాస్కర్.. జడేజా, నరైన్ రూపంలో ఒక​ ఆల్‌రౌండర్‌.. ఒక స్పిన్నర్‌ను ఎంపిక చేశాడు. పేస్‌ బౌలింగ్‌ కోటాలో డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌లైన భువీ, బుమ్రాలకు చోటు దక్కింది. ఇక ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య రేపు (ఏప్రిల్‌ 9న) చెన్నై వేదికగా జరగనుంది

ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవెన్‌ జట్టు: రోహిత్ శర్మ, క్రిస్‌గేల్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, మహేంద్రసింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా

చదవండి: ముందే ఊహించా.. నాకేం ఆశ్చర్యం వేయలేదు

ఏంటి సూర్య.. డ్రెస్సింగ్‌ రూమ్‌ సీక్రెట్స్‌ బయటపెడతారా

మరిన్ని వార్తలు