IPL 2021: ముంబై ఇండియన్స్‌ ప్లేయర్లకు జీపీఎస్‌ వాచ్‌లు

14 Aug, 2021 21:14 IST|Sakshi

దుబాయ్‌: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్‌ రెండో అంచె పోటీలు యూఏఈలో జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌లో పలువురు ఆటగాళ్లు  ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అబుదాబి చేరుకున్న ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు.  అయితే ఆటగాళ్ల కదలికలపై నిఘా వేసేందుకు అబుదాబి ప్రభుత్వం జీపీఎస్‌ వాచీలను అందించింది. జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా క్వారంటైన్ స‌మ‌యంలో ఎవ‌రైనా ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ్డారో లేదో తెలుస్తుంది. అబుదాబిలో క్వారెంటైన్ రూల్స్ క‌ఠినంగా ఉన్నాయి.ఒక‌వేళ దుబాయ్ నుంచి అబుదాబిలో ఎంట‌ర్ కావాల‌న్న‌.. వాళ్లు కోవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్ చూపించాల్సిందే.

మ‌రోవైపు దుబాయ్ హోటల్‌లో బ‌స చేస్తున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు మాత్రం జీపీఎస్ వాచ్‌లను ఇవ్వ‌లేదు. క్వారంటైన్ స‌మ‌యంలో ప్ర‌తి రోజు ఆట‌గాళ్ల‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఇక సెప్టెంబ‌ర్ 19న దుబాయ్‌లో చెన్నై, ముంబై మ్యాచ్‌తో  ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలు మొదలుకానున్నాయి.

మరిన్ని వార్తలు