ముంబై ఇండియన్స్‌ కొత్త జెర్సీ వచ్చేసిందోచ్!‌

27 Mar, 2021 16:50 IST|Sakshi

ఎంటర్‌టైన్‌మెంట్‌ కా బాప్‌ ఐపీఎల్ వచ్చేస్తోంది. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-‌14 వ ఎడిషన్‌ కోసం, విజయవంతమైన ఫ్రాంచైజీగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ తమ కొత్త జెర్సీని శనివారం ఆవిష్కరించింది. ‘ఒక జట్టు, ఒక కుటుంబం, ఒక జెర్సీ’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది. కొత్త జెర్సీ ఆవిష్కరణతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాతో సహా, తమ జట్టు స్టార్ ప్లేయర్స్, విజయాలకు సంబంధించిన మధుర జ్ఞాపకాలతో‌ ఉన్న వీడియోను ట్విటర్‌ లో పోస్ట్‌ చేసింది.

కాగా, ఈ జెర్సీని ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ ద్వయం శాంతను, నిఖిల్ రూపొందించారు. వారి కొత్త జెర్సీలో " - భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం తో కూడిన 5 ప్రాథమిక అంశాలను అందులో చేర్చారు. ‘‘ముంబై ఇండియన్స్ ప్రతి సంవత్సరం క్రమశిక్షణ, విలువలతో కూడిన సిద్ధాంతాలతో అభివృద్ధి చెందుతూ ఈ స్థానానికి వచ్చింది. మా ఐదు ఐపీఎల్ టైటిల్స్ ఈ విలువలకు మా నిబద్ధతకు నిదర్శనం. వాటినే ఈ సంవత్సరం మా జెర్సీ ద్వారా సూచిస్తున్నాం’’ అని ముంబై ఇండియన్స్ ప్రతినిధి మీడియా ప్రకటనలో తెలిపారు.

ఇక, రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 2020లో ఢిల్లీ కెపిటల్స్‌ను ఓడించి తన ఐదో టైటిల్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్‌ కెప్టెన్సీలో ముంబై అత్యధికంగా ఐదు టైటిల్స్‌ ( 2013,15,17,19,20) గెలచిన జట్టుగా నిలిచింది. కాగా ఏ జట్టు ఇంతవరకు వరుసగా మూడు టైటిల్స్ గెలుచుకోలేకపోయింది. రాబోయే ఎడిషన్‌ను గెలుచుకోవడం ద్వారా ఆ రికార్డును కూడా తమ పేరిట నమోదు చేసుకోవాలని ముంబై ఇండియన్స్‌ భావిస్తోంది.  చదవండి: ఐపీఎల్‌లో పాక్‌ క్రికటర్ల రీఎంట్రీ..? )

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు