కింద పడ్డా పోరాటం కొనసాగించాల్సిందే: సామ్సన్‌

23 Apr, 2021 15:40 IST|Sakshi
photo courtesy : ipl website

ముంబై: బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా కనిపిస్తున్నా వరుస మ్యాచ్‌ల్లో ఓటమి రాజస్థాన్‌ రాయల్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. గత సీజన్‌లో వరుస వైఫల్యాలతో కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయిన రాజస్థాన్‌.. ఈసారి కూడా అదే తరహా ప్రదర్శనను పునరావృతం చేస్తోంది. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన సామ్సన్‌ గ్యాంగ్‌.. ఒకదాంట్లో మాత్రమే విజయాన్ని నమోదు  చేసింది. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 177 పరుగుల స్కోరు చేసిన రాజస్థాన్‌ పరాజయం చెందింది. ఈ స్కోరును ఆర్సీబీ 16.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ..   తమకు తిరిగి తప్పకుండా గాడిలో పడతామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ మా బ్యాట్స్‌మన్‌ బాగా ఆడటంతో మంచి స్కోరునే బోర్డుపై ఉంచాం. కానీ వారు మా కన్నా బాగా ఆడటం వల్ల వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించారు. దీనిపై హోమ్‌ వర్క్‌ చేయాల్సిందే.  మా బ్యాటింగ్‌ నిజాయితీగా రివ్యూ జరగాలి. స్పోర్ట్స్‌లో గెలుపు-ఓటములు సహజం.  కింది పడిపోయినా పోరాటం కొనసాగించాల్సిందే అని సామ్సన్‌ తెలిపాడు.ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌,  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు ఒక్కో విజయాన్ని నమోదు చేసినా రన్‌రేట్‌  పరంగా రాజస్థాన్‌ కంటే మెరుగ్గా ఉన్నాయి. 

ఇక్కడ చదవండి: 16 కోట్ల ఆటగాడిపై ఒత్తిడి.. నేనైతే అంత ఇవ్వను!
ముందు సెంచరీ పూర్తి చేసి ఆ మాట చెప్పు..!

>
మరిన్ని వార్తలు