IPL 2021: నీ వల్లే ఐపీఎల్‌ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్‌!

7 May, 2021 11:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల ఆటగాళ్లకి కరోనా వైరస్‌ సోకడంతో అనూహ్యంగా ఐపీఎల్‌ 2021 ని బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ ఈ మహమ్మారి ఎలా సోకిందో బోర్డుకు అంతుచిక్కడం లేదు. ఎక్కడో ఏదో చిన్న నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యాన్నే బోర్డు చెల్లించాల్సి వచ్చింది.  ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ బయోబబుల్‌ లీక్‌కు.. మొదట కోల్‌కతా నైటరైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తికి.. అక్కడి నుంచి సందీప్ వారియర్.. అక్కడి నుంచి అమిత్ మిశ్రాకు వైరస్ సోకడం వెనుక నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనా తమకిష్టమైన ఐపీఎల్‌ వాయిదాకి వరుణ్‌ కారణమంటూ సోషల్‌ మీడియాలో అతనిపై మీమ్స్‌ చేస్తూ అభిమానులు వాళ్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బయోబబుల్‌ ఉల్లంఘన ఎక్కడ జరిగింది?
ఇటీవల ఓ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరణ్‌ని గ్రీన్ చానెల్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. భుజం గాయం కావడంతో స్కానింగ్ చేసినట్లు అందరికి చెప్పారు. కానీ అతనికి భుజ గాయం కాలేదని, కడుపులో మంటతో బాధపడడంతో చికిత్స అందించారని తెలుస్తోంది. అక్కడి నుంచి హోటల్ రూమ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వరుణ్ నిబంధనల ప్రకారం వారం రోజులు క్వారంటైన్‌లోకి  వెళ్లాలి. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. నేరుగా వెళ్లి  సందీప్‌తో కలిశాడు. ఇక్కడ రూల్‌ బ్రేక్‌ అయ్యింది. అదే క్రమంలోనే ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రాతో మాట్లాడాడు. ఇలా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది లీగ్ వాయిదాకు కారణమైనట్లు భావిస్తున్నారు. అందుకే బోర్డు దీనిపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. అసలు బయోబబుల్‌ లీక్‌ పై విచారణ జరిపిస్తోంది.

వరుణ్‌పై సెటైరికల్‌ మీమ్స్‌
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాకు వరుణ్ చక్రవర్తి కారణమంటూ అతనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సామాజిక మాధ్యమంలో వరుణ్‌పై సెటైరికల్‌ మీమ్స్, కామెంట్స్ పెడుతున్నారు.‘గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ వరుణ్ చక్రవర్తి’ అని ఒకరంటే.. ‘డ్రీమ్ 11 సీజన్ క్యాన్స్‌లర్ అవార్డు అతనికేనని’ మరొకరు వ్యంగ్యంగా అతనిపై ట్వీట్ చేస్తున్నారు. వాళ్లు వరుణ్‌ ఫొటోను ఎడిటింగ్ చేసి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. పాపం వరుణ్‌ నెటిజన్లుకు ఇలా బుక్కయ్యాడు. 

( చదవండి: భారత్‌ను విడిచిపెట్టి వెళ్తున్నా.. నన్ను క్షమించండి )

మరిన్ని వార్తలు