పూరన్‌ చెత్త రికార్డు.. ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు?

30 Apr, 2021 21:32 IST|Sakshi
courtesy : IPL Twitter

అహ్మదాబాద్‌: ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో  జేమిసన్‌ బౌలింగ్‌లో పూరన్‌ మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పూరన్‌ డకౌట్ల సంఖ్య నాలుగు చేరింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు డకౌట్‌ అయి అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధికసార్లు డకౌట్‌ అయిన ఆటగాడిగా నిలిచిన పూరన్‌.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడిగా నిలిచాడు.

గిబ్స్‌(2009), మిథున్‌ మన్హాస్‌ (2011), మనీష్‌ పాండే(2012), శిఖర్‌ ధావన్‌(2020)లు వివిధ సందర్భాల్లో నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు డకౌట్‌ అయ్యారు. తాజాగా ఆ లిస్టులో పూరన్‌ కూడా చేరిపోయాడు. ఇక పూరన్‌ ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా 0,0,1, 9,0,19,0 మొత్తంగా 21 పరుగులు చేసి దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇంత దారుణంగా విఫలమవుతున్న పూరన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ తుది జట్టులో ఎందుకు చోటు కల్పిస్తుందో అర్థం కావడం లేదంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికైనా పంజాబ్‌ కళ్లు తెరిచి పూరన్‌ స్థానంలో మలాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలంటూ  నెటిజన్లు కోరుతున్నారు.
చదవండి: అందుకే మయాంక్‌ను పక్కనపెట్టాం

మరిన్ని వార్తలు