మూడుసార్లు గోల్డెన్‌ డక్‌‌.. మూడు సార్లు 80కి పైగా పరుగులు

11 Apr, 2021 21:45 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌ ట్విటర్‌

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో  కేకేఆర్‌ ఓపెనర్‌ నితీష్‌ రానా( 80, 56 బంతులు; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేకేఆర్‌ 187 పరుగుల భారీ స్కోరు చేయడంలో నితీష్‌ కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే నితీష్‌ రానా ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో రానా చివరి ఆరు ఇన్నింగ్స్‌లు చూసుకుంటే వరుసగా 0, 81, 0,87,0,80 పరుగులు సాధించాడు. ఇందులో విశేషమేమిటంటే సరి, బేసి విధానంలో మూడు సార్లు గోల్డెన్‌ డక్‌.. మరో మూడు సార్లు 80కి పైగా పరుగులు సాధించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రానా 80 పరుగులు చేయగా.. అతనికి త్రిపాఠి( 54 పరుగులతో సహకరించాడు. చివర్లో కార్తీక్‌ 9 బంతుల్లోనే 22 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో కేకేఆర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది.
చదవండి: సన్‌రైజర్స్‌తో ఆనాటి మ్యాచ్‌ గుర్తుకో తెచ్చుకో రసెల్‌..!

'పంత్‌ కూల్‌గా ఉండడం మాకు కలిసొచ్చింది'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు