విరాళంపై రూటు మార్చిన కమిన్స్‌!

3 May, 2021 18:54 IST|Sakshi

పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి కాకుండా యూనిసెఫ్‌ సాయంతో..

ఢిల్లీ:  కరోనా కట్టడి కోసం భారత్‌ సాగిస్తున్న పోరుకు తనవంతు సాయంగా 50 వేల డాలర్ల విరాళాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌ ఇవ్వబోతున్నట్లు  ఇటీవల ప్రకటించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ తన రూటు మార్చుకున్నాడు. తాను ఇస్తానన్న విరాళాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి కాకుండా యూనిసెఫ్‌ ఆస్ట్రేలియా సాయంతో అందించనన్నట్లు తాజాగా ప్రకటించాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) భారత్‌కు 50 వేల డాలర్ల విరాళాన్ని యూనిసెఫ్‌ సాయంతో ఖర్చుపెట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కమిన్స్‌ కూడా అదే బాటను ఎంచుకున్నాడు.

పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఇచ్చే విరాళాలు సరైన మార్గంలో వినియోగించబడటం లేదనే భావనలో ఉన్న కమిన్స్‌.. అందుకు యూనిసెఫ్‌ ఆస్ట్రేలియా సాయంతోనే తన విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకోవడానికి ఒక కారణం కావొచ్చు. అందుకే తన ఇచ్చే విరాళానికి రూట్‌ చేంజ్‌ చేశాడు కమిన్స్‌.  కరోనాపై భారత్‌ సాగిస్తున్న పోరాటానికి తొలుత సాయాన్ని ప్రకటించిన క్రికెటర్‌ కమిన్స్‌. దీనికి అంతా ముందుకు రావాలని విజ‍్క్షప్తి చేశాడు. ఆపై చాలామంది క్రికెటర్లు తమవంతు సాయాన్ని ప్రకటించారు. కమిన్స్‌ విరాళాన్ని ప్రకటించిన వెంటనే అతనిపై  ప్రశంసల వర్షం కురిసింది. 

మరిన్ని వార్తలు