IPL 2021 Phase 2: ఈసారి కూడా టైటిల్‌ వాళ్లదే: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

15 Sep, 2021 16:33 IST|Sakshi

David Gower On IPL Title Winner: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 రెండో అంచె ఆదివారం మొదలు కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే జట్లన్నీ యూఏఈ చేరుకుని ప్రాక్టీసులో తలమునకలు కాగా.. ఈసారి టైటిల్‌ విజేత ఎవరన్నా అంశంపై క్రికెట్‌ నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ డేవిడ్‌ గోవర్‌ ముంబై ఇండియన్స్‌కే తన ఓటు వేశాడు. క్రికెట్‌.కామ్‌తో మాట్లాడిన అతడు... ‘‘ముంబై ఇండియన్స్‌ ఎల్లప్పుడూ గెలుస్తూనే ఉంటుంది కదా. ఈసారి కూడా వాళ్లే గెలుస్తారు. చివరల్లో విజయం వారినే వరిస్తుంది’’ అని జోస్యం చెప్పాడు.

చదవండి: T20 World Cup Ind Vs Pak: వాళ్లిద్దరి మధ్య ఆసక్తికర పోరు.. ఒకవేళ అదే జరిగితే

ఇక ఐపీఎల్‌లో తన ఫేవరెట్‌ టాప్‌- 5 ఆటగాళ్ల గురించి చెబుతూ.. ‘‘యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ నంబర్‌వన్‌గా ఉంటాడు. మాస్టర్‌ ఇన్నింగ్స్‌ ఆడే ఏబీ డివిల్లియర్స్‌.. ఆండీ రస్సెల్‌... బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ ఎంస్‌ ధోని.. మెజీషియన్‌ రషీద్‌ ఖాన్‌.. వీరిలో ఎవరికి వారు తమ ఆటలో అత్యుత్తమంగా రాణిస్తున్నారు’’ అని పేర్కొన్నాడు. వీరితో పాటు లసిత్‌ మలింగ, జస్‌ప్రీత్‌ బుమ్రా ఆడే విధానం.. ముఖ్యంగా యార్కర్లు సంధించే విధానం కూడా తనకు ఇష్టమని డేవిడ్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌ 2021లో భాగంగా రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌  7 మ్యాచ్‌లు ఆడి.. నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై.. ఈసారి హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

చదవండి: IPL 2021 Phase 2: ఇరగదీసిన డివిల్లియర్స్‌.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా!

మరిన్ని వార్తలు