పొలార్డ్‌ను చూడండి.. ఎలా లైన్‌ దాటేస్తున్నాడో?

24 Apr, 2021 00:06 IST|Sakshi
Photo Courtesy: Twitter

చెన్నై:   ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌ వేయడానికి ముందే డ్వేన్‌ బ్రావో క్రీజును దాటేసి ముందుకు వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బౌలర్‌ క్రీజ్‌ లైన్‌ దాటి బౌలింగ్‌ వేస్తే నో బాల్‌ కదా.. బ్యాట్స్‌మన్‌ ముందే క్రీజ్‌ దాటితే ఏమి చేయాలంటూ మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ధ్వజమెత్తాడు. కాగా, ముంబై ఇండియన్స్‌-పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య  జరిగిన మ్యాచ్‌లో కూడా ఈ తరహా ఘటన చోటు చేసుకుంది.

పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌ వేసే క్రమంలో నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌లో ఉన్న ముంబై బ్యాట్స్‌మన్‌ కీరోన్‌ పొలార్డ్‌ క్రీజ్‌ను దాటి ముందుకు వెళ్లిపోయాడు. బౌలర్‌ వైపు చూస్తూనే ఇలా వెళ్లడం ట్వీటర్‌లో విమర్శల వర్ష మొదలైంది. ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ పొలార్డ్‌ చేసిన పనిని తప్పుబట్టాడు. ఇలాంటి వారికి ఐదు పరుగుల పెనాల్టీ విధించాలని కోరుతున్నారు. కామెంటేటర్లు కూడా ఇదే విషయాన్ని  చెప్పారని ఒక ట్వీటర్‌ యూజర్‌ కోడ్‌ చేశాడు. 

2019 ఐపీఎల్‌ సీజన్‌లో అప్పటి కింగ్స్‌ పంజాబ్‌( పంజాబ్‌ కింగ్స్‌) బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఎవరిది తప్పు..  ఎవరిది ఒప్పు అనే కోణంలో సుదీర్గమైన చర్చలు నడిచాయి. ఆ తర్వాత మన్కడింగ్‌ చేయడం ఐపీఎల్‌లో ఎక్కడా కనిపించలేదు. తాజాగా బ్యాట్స్‌మన్‌ పదే పదే క్రీజ్‌ దాటుతుండటంతో మన్కడింగ్‌ సబబే అనే వాదన వినిపిస్తోంది. 

మరిన్ని వార్తలు