ఐపీఎల్‌ 2021: ఆర్‌సీబీపై పంజాబ్‌ కింగ్స్‌ గెలుపు

30 Apr, 2021 23:31 IST|Sakshi
Photo Courtesy: IPL/Twitter

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌  34 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో కోహ్లి 35, పాటిదార్‌ 31,  హర్షల్‌ పటేల్‌ 27 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బార్‌ 3 వికెట్లతో మెరవగా.. రవి బిష్ణోయి 2, మెరిడిత్‌ , జోర్డాన్‌లు,షమీలు తలా ఒక వికెట్‌ తీశారు.

అంతకముందు పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ( 91, 57 బంతులు; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించడంతో పంజాబ్‌ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. హర్షల్‌ పటేల్‌ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లు.. రెండు ఫోర్లు సహా మొత్తం 22 పరుగులు వచ్చాయి.  హర్‌ప్రీత్‌ బార్‌ 25 పరుగులతో రాహుల్‌కు అండగా నిలిచాడు. అంతకముందు గేల్‌ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆర్‌సీబీ బౌలర్లలో జేమిసన్‌ 2, సామ్స్‌, చహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

96 పరుగులకే 6 వికెట్లు.. కష్టాల్లో ఆర్‌సీబీ
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ చేధనలో తడబడుతుంది. 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 8 పరుగులు చేసిన షాబాజ్‌ అహ్మద్‌ రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అంతకముందు 31 పరుగులు చేసిన పాటిదార్‌ క్రిస్‌ జోర్డాన్‌ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో హర్‌ప్రీత్‌బార్‌ బౌలింగ్‌లొ డివిలియర్స్‌(3) రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం 

మ్యాక్స్‌వెల్‌ డకౌట్‌.. ఆర్‌సీబీ 62/3
ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. హర్‌ప్రీత్‌ బార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో రెండో బంతికి క్లీన​ బౌల్డ్‌ అయ్యాడు. అంతకముందు ఓవర్‌ తొలి బంతికి 35 పరుగులు చేసిన కోహ్లి కూడా బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆర్‌షఋబీ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. పాటిదార్‌ 16, డివిలియర్స్‌ 0 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

8 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 50/1
8 ఓవర్ల ఆట ముగిసేసరికి ఆర్‌సీబీ వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి రెండుసార్లు రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కోహ్లి 28, పాటిదార్‌ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ.. 19/1
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఓపెనర్ పడిక్కల్‌ మెరిడిత్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 20 పరుగులు చేసింది. కోహ్లి 12, పాటిధార్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

రాహుల్‌ మెరుపులు.. ఆర్‌సీబీ టార్గెట్‌ 180
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ( 91, 57 బంతులు; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించడంతో పంజాబ్‌ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. హర్షల్‌ పటేల్‌ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లు.. రెండు ఫోర్లు సహా మొత్తం 22 పరుగులు వచ్చాయి.  హర్‌ప్రీత్‌ బార్‌ 25 పరుగులతో రాహుల్‌కు అండగా నిలిచాడు. అంతకముందు గేల్‌ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆర్‌సీబీ బౌలర్లలో జేమిసన్‌ 2, సామ్స్‌, చహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

వరుస విరామాల్లో  మూడు వికెట్లు.. పంజాబ్‌ 119/5
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తొలుత ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో జేమిసన్‌ బౌలింగ్‌లో పూరన్‌ మరోసారి డకౌట్‌ కాగా.. పూరన్‌కు ఈ సీజన్‌లో నాలుగో డకౌట్‌ కావడం విశేషం. ఇక 14వ ఓవర్లో షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో 5 పరుగులు చేసిన హుడా పాటిధార్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్‌లో చహల్‌ బౌలింగ్‌లో షారుఖ్‌ ఖాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రాహుల్‌ 56, హర్‌ప్రీత్‌ బార్‌ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

గేల్‌ ఔట్‌.. 11 ఓవర్లలో 101/2
పంజాబ్‌ కింగ్స్‌ కీలక వికెట్‌ను కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న గేల్‌(46) డేనియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. రాహుల్‌ 43, పూరన్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ధాటిగా ఆడుతున్న గేల్‌.. 7 ఓవర్లలో 64/1
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ ధాటిగా ఆడుతున్నాడు. ప్రబ్‌సిమ్రాన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గేల్‌ జేమిసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 6వ ఓవర్లో ఐదు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత చహల్‌ వేసిన 7వ ఓవర్లో రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పంజాబ్‌ 7 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 64 పరుగులు చేసింది. గేల్‌ 36, రాహుల్‌ 19 పరుగులతో ఆడుతున్నారు.

తొలి వికెట్‌ డౌన్‌.. పంజాబ్‌ 21/1
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. 7 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రాన్‌ కైల్‌ జేమిసన్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్‌ స్కోరు 4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. రాహుల్‌ 12 , గేల్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అహ్మదాబాద్‌: ఐపీఎల్ 2021 సీజన్‌లో విజయాలతో జోరు మీదున్న ఆర్‌సీబీ నేడు పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. తాజా సీజన్‌లో ఇప్పటికే ఆరు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఐదు గెలిచి.. ఒకటి ఓడిపోయి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆరు మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది. కాగా టాస్‌ గెలిచిన ఆర్‌సీబీఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌ కోసం ఆర్‌సీబీ జట్టులో సుందర్‌ స్థానంలో షాబాజ్‌ అహ్మద్‌  తుది జట్టులోకి రాగా.. పంజాబ్‌ కింగ్స్‌ మూడు మార్పులు చేసింది. మయాంక్‌, అర్షదీప్‌, హెన్రిక్స్‌ స్థానంలో లే మెరిడిత్‌, ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌, హర్‌ప్రీత్‌ బార్‌లు తుది జట్టులోకి వచ్చారు.

ఇరు జట్ల ముఖాముఖి రికార్డులను పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందగా.. మిగిలిన 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది.  బెంగళూరుపై ఇప్పటి వరకూ పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 232 పరుగులు కాగా.. పంజాబ్‌పై బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 226 పరుగులుగా ఉంది. అయితే గత సీజన్‌లో మాత్రం ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల్లో తలపడగా.. రెండుసార్లు పంజాబ్‌ కింగ్స్‌నే విజయం వరించింది.

ఆర్‌సీబీ: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, డేనియల్‌ సామ్స్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, షాబాజ్‌ అహ్మద్‌, రజత్‌ పాటిధార్‌, జెమీసన్‌, మహ్మద్‌ సిరాజ్‌, యజ్వేంద్ర చహల్‌, హర్షల్‌ పటేల్‌

పంజాబ్‌ కింగ్స్‌: కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌)‌,  క్రిస్‌ గేల్‌, పూరన్‌‌, దీపక్‌ హూడా, షారుఖ్‌ ఖాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, షమీ, రవి బిష్ణోయి, రిలే మెరిడిత్‌, ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌, హర్‌ప్రీత్‌ బార్‌

మరిన్ని వార్తలు