రాజస్తాన్‌ రాయల్స్‌  ఔదార్యం.. కరోనా బాధితుల కోసం పెద్ద మొత్తం

29 Apr, 2021 16:02 IST|Sakshi
courtesy : IPL Twitter

ఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ  రాజస్తాన్‌ రాయల్స్‌ పెద్ద మనసును చాటుకుంది. దేశంలో కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు రూ 7.5 కోట్లు విరాళంగా ఇచ్చి తన ఔదార్యాన్ని గొప్పగా చాటుకుంది. ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడుతున్న పలువురు ఆటగాళ్లు కరోనా బాధితుల కోసం తమకు తోచిన సాయం అందిస్తున్నారు. పాట్‌ కమిన్స్‌, శ్రీవాత్సవ గోస్వామి, బ్రెట్‌ లీ, షెల్డన్‌ జాక్సన్‌లు పెద్ద మొత్తంలో సాయం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.

ఈ నేపథ్యంలోనే కరోనా బాధితులకు అండగా ఉండేందుకు జట్టులోని ఆటగాళ్లతో పాటు మేనేజ్‌మెంట్‌ సహాయంతో మొత్తం రూ. 7.5 కోట్లను అందజేస్తున్నట్లు రాజస్తాన్‌ రాయల్స్‌ తన ట్విటర్‌లో పేర్కొంది. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌ సహాయానికి సోషల్‌ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన నమోదు చేయడం లేదు. కెప్టెన్‌ మారినా విజయాలు మాత్రం సాధించలేకపోయింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు.. మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.  కాగా నేడు ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
చదవండి: బ్రెట్‌ లీ ఔదార్యం.. 1 బిట్‌కాయిన్ విరాళం

మరిన్ని వార్తలు