నూతన జెర్సీని ఆవిష్కరించిన ఆర్‌ఆర్‌

5 Apr, 2021 16:40 IST|Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌-2021 సీజ‌న్‌ ప్రారంభానికి ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్టు నూతన జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం రాత్రి జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఇందుకోసం స్టేడియంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి, ముందుగా ఓ వీడియో మాంటేజ్‌ను ప్లే చేశారు. అనంతరం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆటగాళ్లు త్రీడీ ప్రొజెక్ష‌న్స్ రూపంలో కొత్త జెర్సీల్లో క‌నువిందు చేశారు.

ఇప్పటివరకు జరిగిన జెర్సీ లాంచింగ్‌ ప్రోగ్రామ్స్‌లో ఇది అత్యద్భుతంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్ర‌స్తుతం ముంబైలో ఉన్న రాజ‌స్థాన్ జట్టు.. ఈ నెల 12న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. కాగా, ఏప్రిల్‌ 9న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టును ఢీకొంటుంది.
చదవండి: రూల్‌ ప్రకారం అతను నాటౌట్‌.. అదనంగా 5 పరుగులు కూడా

మరిన్ని వార్తలు