'మా సీక్రెట్‌ అదే.. అందుకే స్థిరంగా ఉన్నాం'

11 Apr, 2021 15:48 IST|Sakshi

చెన్నై: 2016లో డేవిడ్‌ వార్నర్‌ సారధ్యంలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఫైనల్లో ఆర్‌సీబీపై విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి ప్రతీ ఏటా స్థిరమైన ప్రదర్శన చేస్తూ కనీసం ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తూ వస్తుంది. 2018 ఐపీఎల్‌లోనూ కేన్‌ విలియమ్స్‌న్‌ నాయకత్వంలో ఫైనల్‌కు చేరుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. తాజాగా 2021 ఐపీఎల్‌ సీజన్‌లో మరోసారి పెద్ద అంచనాలు లేకుండానే బరిలోకి దిగుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ నేడు కేకేఆర్‌తో తలపడనుంది.

ఈ నేపథ్యంలో ఆ జట్టు బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ''ఐపీఎల్‌ 14వ సీజన్‌ను కేకేఆర్‌ మ్యాచ్‌తో ఆరంభించనున్నాం. వాస్తవానికి మేం ఐపీఎల్‌లో ఎలాంటి గోల్స్‌ పెట్టుకోకుండానే బరిలోకి దిగుతుంటాం. ఎక్కడివరకు ఆడుతా.. ఆటను ఎలా ఫినిష్‌ చేయాలి అనే ఆలోచనలు మా మనసులోకి రానీయం. ఒకవేళ పెద్ద గోల్స్‌ ఏమైనా పెట్టుకొని ఐపీఎల్‌కు సిద్ధమైన మ్యాచ్‌ వరకు వచ్చేసరికి అమలు చేయడం కష్టమవుతుంది. అలాంటి ఆలోచనలు వస్తే మా ప్లాన్స్‌ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతీ సీజన్‌లో ఎలాంటి ప్రణాళికలు లేకుండా బరిలోకి దిగుతున్నాం కాబట్టే మా జట్టు స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుంది. నిజానికి మా సీక్రెట్‌ కూడా అదే. అదే మా జట్టును కూడా అద్భుతంగా తయారు చేసింది. మేం ఎప్పుడు ఫైనల్‌, ప్లే ఆఫ్స్‌ గురించి ముందే ఆలోచించం. ఆరోజు జరిగే మ్యాచ్‌లో ఎలా గెలవాలనేదానిపై ఎక్కువ ఫోకస్‌ పెడుతాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. 
చదవండి: మా మదిలో అదే ఉంది: అదే మా కొంప ముంచింది

ధోని ప్లాన్‌ వర్కవుట్‌ అయి ఉంటే, చెన్నైదే విజయం!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు