ఫ్యాన్స్‌.. వారిద్దరు ఏం మాట్లాడుకుంటారో వినండి

10 Apr, 2021 18:26 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్‌ వెబ్‌సైట్‌

ముంబై: వాంఖడే వేదికగా కాసేపట్లో సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య రెండో లీగ్‌ మ్యాచ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి చేసిన వాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ట్విటర్‌ వేదికగా రవిశాస్త్రి స్పందిస్తూ.. గురు(ధోని).. అతని శిష్యుడు రిషబ్‌ పంత్‌ ఒకరినొకరు ప్రత్యర్థులుగా ఎదురుపడుతున్నారు. బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ సమయంలో ఈ గురు శిష్యులు ఏం మాట్లాడుకుంటున్నారనేది ఫ్యాన్స్‌ వినాలని కోరుకుంటున్నా.. కాబట్టి మైదానంలో ఉన్న స్టంప్‌ మైక్‌ సౌండ్‌ను జాగ్రత్తగా గమనించండి. అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

మరోవైపు మ్యాచ్‌కు ముందు పంత్‌ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ''తన గురువు టీంతోనే తొలి మ్యాచ్‌లో ఎదుర్కోబోతున్నందుకు ఉత్సాహంతో ఉన్నా. ఇప్పటికే మహీ బాయ్‌ నుంచి విలువైన సూచనలతో పాటు ఎంతో అనుభవం నేర్చకున్నా. ఒకవైపు ధోనితో తలపడుతున్నందుకు ఉత్సాహంగా ఉన్నా.. సీఎస్‌కే గేమ్‌ ప్లాన్‌ను అర్థం చేసుకునేందుకు మా ప్రయత్నాలు మాకుంటాయి. ఏదైమైనా మ్యాచ్‌ గెలవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు.   
చదవండి: రనౌట్‌ అయితే అయ్యావు.. కానీ మనసులు గెలుచుకున్నావ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు