దానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడం గర్వంగా ఉంది: జడేజా

27 Apr, 2021 20:42 IST|Sakshi

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ప్రముఖ స్పోర్ట్స్‌ వేర్‌ యాక్సెసరీస్‌ బ్రాండ్‌ ‘ఆసిక్స్’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ విషయాన్ని జడేజా ట్విటర్‌లో షేర్‌ చేస్తు తన సంతోషాన్ని పంచుకున్నాడు.'' ‘ఆసిక్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులు కావడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. అంటూ'' ఈ ఆల్‌రౌండర్‌ ట్వీట్‌ చేశాడు.

జడ్డూ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా మరింతగా విస్తరించే అవకాశం లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో చెప్పింది. రన్నింగ్‌ కేటగిరీలో తమ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చూస్తామని, ఈ ఒప్పందం విభిన్నమైన ఉత్పత్తుల గురించి అవగాహన పెంచుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న రవీంద్ర జడేజా సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆర్‌సీబీతో జరిగన మ్యాచ్‌లో జడేజా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒక్క ఓవర్‌లో 37 పరుగులు  రాబట్టి గేల్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. కాగా ఆర్‌సీబీపై విజయంతో టేబుల్‌ టాపర్‌గా ఉన్న సీఎస్‌కే తన తర్వాతి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఎదుర్కోనుంది. 
చదవండి: ఒక్క ఓవర్‌.. 37 పరుగులు.. జడ్డూ విధ్వంసం

మరిన్ని వార్తలు