అసలైన టీ20 క్రికెటర్‌ అతడే: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

5 Oct, 2021 16:58 IST|Sakshi

Michael Vaughan comments on Ravindra Jadeja:  చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. జడేజా అసలు సిసలైన టీ20 ఆటగాడని అతడు కితాబు ఇచ్చాడు. "రవీంద్ర జడేజా అత్యుత్తమమైన ఆటగాడు. మూడు విభాగాల్లో రాణించే సత్తాఉంది.అతడు  అద్భుతమైన ఫీల్డర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌల్ చేయగలడు. ఎటువంటి పిచ్‌పై అయిన బాల్‌తో  మ్యాచ్‌ తిప్పగలడు.

ఇక బ్యాటింగ్‌ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో జట్టు వికెట్లు కోల్పోయినట్లయితే అతడు కీలక  పాత్రను పోషించగలడు. అందుకే అతడు టీ20 క్రికెటర్లలో అధ్బుతమైన ఆటగాడు.  మీరు ఒక టీ 20 క్రికెటర్‌ని తయారు చేస్తే.. క్రిస్ గేల్‌ను, విరాట్ కోహ్లిలను ఆదర్శంగా చూపిస్తారు. కానీ ఇప్పటినుంచి రవీంద్ర జడేజాను ఆదర్శంగా తీసుకోవాలి" అని  మైఖల్‌ వాన్‌ క్రిక్‌ బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో రవీంద్ర జడేజా అధ్బుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2021 లో జడేజా ఇప్పటి వరకు  212 పరుగులు,10 వికెట్లు సాధించాడు. జడేజా అనేక సందర్భాల్లో బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా చెన్నైకు విజయాలను అందించాడు. టోర్నమెంట్‌ తొలి దశలో హర్షల్ పటేల్‌ ఓవర్‌లో జడేజా ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. సెకెండ్‌ఫేజ్‌లో  కెకెఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో  జడేజా కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 22 పరుగులు చేసి మ్యాచ్‌ ఫినిషర్‌గా నిలిచాడు.

చదవండి: Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్‌ గెలుస్తాడులే!

మరిన్ని వార్తలు