IPL 2021: కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌

11 Sep, 2021 08:31 IST|Sakshi

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్‌ కరోనా కారణంగా అర్థంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌తో ఆధిక్యంలో ఉంది. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె పోటీలకు వారం సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఇంగ్లండ్‌ టూర్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌ను లండన్‌కు పంపించనుంది. చార్టర్‌ ఫ్లైట్‌లో దుబాయ్‌కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లి, సిరాజ్‌లు చార్టర్‌ ఫ్లైట్‌ ఎక్కుతారు..  ఆదివారం ఉదయం దుబాయ్‌లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అంటూ ఆర్‌సీబీ పేర్కొంది. 

చదవండి: IND VS ENG 5th Test: ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?

ఇక ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ మంచి ప్రదర్శన కనబరిచింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు, రెండు ఓటములతో 10 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఆర్‌సీబీ ఫ్రాంచైజీ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఈసారి టైటిల్‌ ఫెవరెట్లలో ఆర్‌సీబీ ఒకటని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

చదవండి: SL Vs SA: ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌.. అయినా గెలిపించలేకపోయాడు

>
మరిన్ని వార్తలు