చిన్న పిల్లాడిలా కోహ్లి.. ఏబీ, చహల్‌ మాత్రం

17 Apr, 2021 15:42 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆర్‌సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మంచి జోష్‌లో ఉంది. మొదట ముంబైని మట్టికరిపించిన ఆర్‌సీబీ  ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడగొట్టి టాప్‌ ప్లేస్‌లో ఉంది. రేపు కేకేఆర్‌తో మూడో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ ఆర్‌సీబీ ఆటగాళ్లు సరదాగా సప్పర్‌ థియేటర్‌ గేమ్‌ ఆడారు. విరాట్‌ కోహ్లి, డివిలియర్స్‌, యజ్వేంద్ర చహల్‌ మూడు జట్లకు నాయకత్వం వహించగా.. ఇతర ఆటగాళ్లు ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ అందించారు. ముందు కోహ్లి అగ్లీ డక్లింగ్‌తో చిన్నపిల్లాడిలా మారిపోయి తన యాక్టింగ్‌తో ఇరగదీయగా.. డివిలియర్స్‌ సిండ్రిల్లా గేమ్‌ ఆడాడు. ఇక చహల్‌ కోహ్లి, డివిలియర్స్‌ను అనుసరిస్తూ చేసినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కాగా ఆర్‌సీబీ ఆటగాళ్లతో పాటు వారి ఫ్యామిలీలు.. జట్టు మేనేజ్‌మెంట్‌ పాల్గొన్నారు.

ఈ విషయాన్ని ఆర్‌సీబీ తన బోల్డ్‌ డైరీస్‌లో పంచుకుంది. ''ఇది కేవలం ఫన్‌ కోసం మాత్రం కాదు. దాదాపు 50 రోజులకు పైగా జట్టుగా కలిసి క్రికెట్‌ ఆడాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి దూరమయ్యేందుకు ఇలా చిన్ననాటి ఆటలను మరోసారి ఆడిపించాం. వాళ్లు ఎంత సరదాగా ఆడారో.. అంత ఎంటర్‌టైన్‌ అందించారు.'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున దారుణంగా విఫలమైన ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం ఆర్‌సీబీ తరపున మాత్రం అదరగొడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన అతను రెండో మ్యాచ్‌లో 59 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.
చదవండి: కోహ్లికి నాలుగే సూచనలు చేశా: ఏబీ

మరిన్ని వార్తలు