ఒక కెప్టెన్‌గా ఏం ఆశించానో.. అదే చేశాడు ‌: కోహ్లి

ఆర్సీబీ ఆటగాళ్లు(ఫొటో కర్టెసీ: ఐపీఎల్‌)

హర్షల్‌ పటేల్‌పై కోహ్లి ప్రశంసల జల్లు

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 తొలి మ్యాచ్‌లో తమకు అద్భుత విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్‌ హర్షల్‌ పటేల్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. డెత్‌ ఓవర్‌ బౌలర్‌గా తనను సీజన్‌ మొత్తం కొనసాగిస్తామని పేర్కొన్నాడు. మ్యాచ్‌ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ నుంచి హర్షల్‌ను మేం కొనుగోలు చేశాం. తనదైన ప్రణాళికలతో, జట్టు తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చడంలో సఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తను ఎంతో ప్రత్యేకంగా నిలిచాడు. డెత్‌ ఓవర్లలో తన సేవలు వినియోగించుకుంటాం. ఒక కెప్టెన్‌గా తన నుంచి నేనేం ఆశించానో, ఆ అంచనాలను తను అందుకున్నాడు’’ అని కితాబిచ్చాడు. 

ఇక జెమీసన్‌, యజువేంద్ర చహల్‌, మహ్మద్‌ సిరాజ్‌ సైతం శుభారంభం చేశారని కోహ్లి పేర్కొన్నాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఫాస్ట్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ అద్భుతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, మార్కో జెన్‌సన్‌ వంటి ముంబై ఇండియన్స్‌ కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చి ఉత్కంఠ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన హర్షల్‌ ఆర్సీబీ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, ఆర్సీబీ 2 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన​ఇన ఛేదించి గెలుపుతో బోణీ కొట్టింది.

చదవండి: అందుకే హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయలేదు.. కానీ 
పడిక్కల్‌ను పక్కకు పెట్టడానికి కారణం అదేనా..

>
Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు