ఐపీఎల్‌ 2021: ఒక్క పరుగు తేడాతో ఆర్‌సీబీ విజయం

27 Apr, 2021 23:27 IST|Sakshi
Courtesy : IPL Twitter

ఒక్క పరుగు తేడాతో ఆర్‌సీబీ విజయం
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.  172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాల్సి ఉండగా.. సిరాజ్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేసి ఒక్క పరుగు తేడాతో ఆర్‌సీబీని గెలిపించాడు. ఢిల్లీ బ్యాటింగ్‌లో పంత్‌ 58 నాటౌట్‌, హెట్‌మైర్‌ 53 నాటౌట్‌ రాణించినా గెలిపించలేకపోయారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 2, జేమిసన్‌, సిరాజ్‌లు చెరో వికెట్‌ తీశారు.

అంతకముందు ఆర్‌సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌(45 బంతుల్లో 75 పరుగులు, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టు గౌరవమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌, రబడ, ఆవేశ్‌ ఖాన్‌, మిశ్రా, అక్షర్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

16 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 116/4
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది. పంత్‌ 39, హెట్‌మైర్‌ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మార్కస్‌ స్టొయినిస్‌(22) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ నాలుగో బంతికి స్టొయినిస్‌ డివిలియర్స్‌కు క్చాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు 13 ఓవర్లలో 93/4గా ఉంది.

మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ..
లక్ష్య చేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తడబడుతుంది. 21 పరుగులు చేసిన పృథ్వీ షా హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. స్టొయినిస్‌ 4,రిషబ్‌ పంత్‌ 14 పరుగులతో ఆడుతున్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండు వికెట్లను కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో స్మిత్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు ఫాంలో ఉన్న ధావన్‌ 7 పరుగులు చేసి కైల్‌ జేమిసన్‌ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం  ఢిల్లీ స్కోరు 3.3 ఓవర్లలో 28/2గా ఉంది. పృథ్వీ షా14, పంత్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఢిల్లీ టార్గెట్‌ 172
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌(45 బంతుల్లో 75 పరుగులు, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టు గౌరవమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా స్టొయినిస్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో వైడ్‌ సహా 3 సిక్సర్లు బాది మొత్తంగా 23 పరుగులు పిండుకున్నాడు.

కాగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 30 పరుగుల వద్ద కోహ్లి, పడిక్కల్‌ వరుస ఓవర్లలో క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ 25, పాటిధార్‌ 31 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. మ్యాక్స్‌వెల్‌ ఔటైన తర్వాత డివిలియర్స్‌ ఆరంభంలో ఆచితూచి ఆడినా చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌, రబడ, ఆవేశ్‌ ఖాన్‌, మిశ్రా, అక్షర్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

18 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 6 పరుగులు చేసిన సుందర్‌ రబడ కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. డివిలియర్స్‌ 48, సామ్స్‌ 2 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

16 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 124/4
అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో 31 పరుగులు చేసిన పాటిధార్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే డివిలియర్స్‌ ఇంకా క్రీజులో ఉండడంతో ఆర్‌సీబీ మంచి స్కోరు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 16 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 124/4గా ఉంది. డివిలియర్స్‌ 35, సుందర్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

14 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు.. 105/3
మ్యాక్స్‌వెల్‌ అవుటైన తర్వాత పాటిధార్‌, డివిలియర్స్‌ నిలకడగా ఆడుతున్నారు. ఇద్దరి మధ్య ఇప్పటివరకు 45 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం ఆర్‌సీబీ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. పాటిధార్‌ 30, డివిలియర్స్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

మ్యాక్స్‌వెల్‌ ఔట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
ఆర్‌సీబీ 60 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ స్కోరు 60/3గా ఉంది

ఏడు ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు.. 47/2
ఆర్‌సీబీ ఏడు ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ 14, పాటిధార్‌ 3 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు. అంతకముందు 30 పరుగుల వద్ద ఓపెనర్లు ఇద్దరు క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ.. 30/2
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత 12 పరుగులు చేసిన కోహ్లి ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరగ్గా.. 17 పరుగులు చేసిన పడిక్కల్‌ ఇషాంత్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం 4.3 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 30/2గా ఉంది. 

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో నేడు మరో ఆసక్తికరపోరు జరగనుంది. రిషబ్‌ పంత్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌..  విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోని ఆర్‌సీబీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.కాగా సీజన్‌లో వరుసగా నాలుగు విజయాలతో జోరు మీద కనిపించిన ఆర్‌సీబీ సీఎస్‌కేతో జరిగిన ఐదో మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. అటు ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ ద్వారా విజయం సాధించింది. అయితే ఇరు జట్లలో హిట్టర్లకు కొదువ లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఇక ముఖాముఖి పోరు చూసుకుంటే ఇరు జట్లు 26 సార్లు తలపడగా.. ఆర్‌సీబీ 15 సార్లు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 10 సార్లు విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఢిల్లీపై ఇప్పటి వరకూ బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 215 పరుగులుకాగా.. బెంగళూరుపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 196 పరుగులగా ఉంది. అయితే గత ఐపీఎల్‌ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించడం విశేషం.

ఆర్‌సీబీ: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, డేనియల్‌ సామ్స్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రజత్‌ పాటిధార్‌, జెమీసన్‌, మహ్మద్‌ సిరాజ్‌, యజ్వేంద్ర చహల్‌, హర్షల్‌ పటేల్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, ధవన్‌, స్టీవ్‌ స్మిత్‌, రిషబ్‌ పంత్‌, షిమ్రోన్‌ హెట్మేయర్‌, స్టొయినిస్‌, అక్షర్‌ పటేల్‌, ఇషాంత్‌ శర్మ, రబాడ, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు