ఐపీఎల్‌ మ్యాచులు ఇక్కడ వద్దంటు సీఎంకు లేఖ

8 Apr, 2021 15:44 IST|Sakshi

ముంబై: ప్రస్తుతం కరోనా వైరస్‌ ముంబైలో విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడేలో ఐపీఎల్‌ మ్యాచులు జరుగుతాయా లేదా అన్న సందేహం మొదలైంది. ఇటీవల బీసీసీఐ మెంబర్‌ మ్యాచులకు సంబంధించి వేదికలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టత వచ్చింది. కానీ ప్రస్తుతం వాంఖడే సమీపంలోని స్థానికులు కేసులు కారణంగా ముంబై వేదికను మార్చాలంటూ సీఎం ఉద్దవ్‌ఠాక్రేకు లేఖ రాశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) తన ప్రణాళికను రూపొందించినప్పుడు దేశంలో కోవిడ్ -19 కేసుల పరిస్థితి సాధారణంగానే నమోదు అయ్యేవి. అయితే, గత రెండు వారాలు, దేశంలోని అన్ని నగరాల్లో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ప్రత్యేకంగా మహరాష్ట్రలో అత్యధిక కేసలు నమోదవుతూ ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. వీటి నివారణకు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం  నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ వంటి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల విషయంలో మాత్రం అనుకున్నట్లుగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ముంబై వేదికను మార్చాలని కోరుతూ వాంఖడే స్టేడియం సమీపంలోని నివాసితులు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేకు లేఖ రాశారు.

స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా , ఆటగాళ్లు వేదిక చేరుకున్నాక తమ అభిమాన ఆటగాడిని చూడాలన్న కోరికతో అభిమానులు గూమికూడే అవకాశం ఉంది. తద్వారా కరోనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికను మార‍్చవలసిందిగా అక్కడి స్థానికులు సీఎంకు లేఖ రాశారు. వివాహాలు, మరణాలు మొదలైన మతపరమైన, ఇతర సామాజిక కార్యకలాపాల విషయంలో ఆంక్షలు విధించిన  రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఎలా అనుమతినిస్తుందని వారు తమ లేఖలో పేర్కొన్నారు.

( చదవండి: వాంఖడేలో చాపకింద నీరులా కరోనా.. తాజాగా మరో ముగ్గురికి )

  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు