మొదట రనౌట్‌ చేసినందుకు.. తర్వాత మ్యాచ్‌ గెలిచినందుకు

16 Apr, 2021 19:58 IST|Sakshi
Courtesy: Rajasthan Royals Twitter‌

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఒక దశలో చేధిస్తుందా అన్న అనుమానం కలిగినా.. మిల్లర్‌, మోరిస్‌ మెరుపులతో ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసింది. అయితే విజయం సాధించి జోష్‌లో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ అనంతరం తమ డ్రెస్సింగ్‌ రూమ్‌లో సెలబ్రేషన్స్‌ చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. ముఖ్యంగా రియాన్‌ పరాగ్‌ బిహూ డ్యాన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

''మ్యాచ్‌లో విజయం సాధించాం.. మా మూడ్‌ బాగుంది.. అందుకే డ్యాన్స్‌ సెలబ్రేషన్స్''‌ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియోపై రాయల్స్‌ అభిమాని వినూత్న రీతిలో స్పందించాడు. ''ఈరోజు మ్యాచ్‌ మీది... ఆ విజయం మీ సొంతం.. సంజూ సామ్సన్‌కు కెప్టెన్‌గా తొలి విజయం.. ఫైనల్లీ ఆర్‌ఆర్‌ విన్‌'' అంటూ ఎమోషన్‌ల్‌గా పేర్కొన్నాడు. కాగా రియాన్‌ పరాగ్‌ బ్యాటింగ్‌లో సరైన ప్రదర్శన కనబరచకపోయినా.. ఢిల్లీ ఇన్నింగ్స్‌ సమయంలో పంత్‌ను డైరెక్ట్‌ త్రో ద్వారా రనౌట్‌ చేశాడు. అతన్ని అవుట్‌ చేసిన ఆనందంలో పరాగ్‌ డ్యాన్‌ చేసిన వీడియో కూడా ఆకట్టుకుంది. 

ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ ఉనాద్కట్‌ ధాటికి టాప్‌ ఆర్డర్‌ విఫలం కాగా.. కెప్టెన్‌ పంత్‌ హాఫ్‌ సెంచరీతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరంభంలో ఢిల్లీ బౌలర్ల దాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే మిడిలార్డర్‌లో మిల్లర్‌(63)తో పాటు ఆఖర్లో క్రిస్‌ మోరిస్‌( 36, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
చదవండి: పృథ్వీ షాను ఔట్‌ చేయడానికి ఆ ప్లాన్‌ ఉపయోగించా

A post shared by Rajasthan Royals (@rajasthanroyals)
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు