ఐపీఎల్‌ 2021: డేవిడ్‌ వార్నర్‌ను ఆటపట్టించిన రోహిత్‌

3 Apr, 2021 13:33 IST|Sakshi

చెన్నై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇటీవలే జట్టుతో కలిసిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఏ ఆటగాడైనా సరే క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి అని బీసీసీఐ  స్పష్టం చేసింది. అలా వార్నర్‌ ఆసీస్‌ నుంచి వచ్చిన వెంటనే నేరుగా క్వారంటైన్‌లో ఉంటున్నాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులనుద్దేశించి వార్నర్‌ వారిని సలహాలు అడిగాడు.

" హాయ్‌ ఫ్యాన్స్‌.. ఆసీస్‌ నుంచి ఇండియాకు చేరుకున్నా.. మా ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌తో కలిశాను. అయితే ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. క్వారంటైన్‌లో ఉన్నన్ని రోజులు బోర్‌ కొట్టకుండా ఏవైనా సలహాలు ఉంటే చెప్పండి.. అవసరమైతే కొన్ని మంచి సినిమాల గురించి సజెస్ట్‌ చేయండి.'' అంటూ కామెంట్‌ చేశాడు.


దీనికి సంబంధించి నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్లు పెట్టగా.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది.  వార్నర్‌.. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు క్వారంటైన్‌లో ఉన్నప్పుడు టిక్‌టాక్‌తో కాలం గడిపావు.. కానీ ఈసారి మాత్రం ఆ అవకాశం నీకు లేదు..కచ్చితంగా నువ్వు టిక్‌టాక్‌ మిస్సవుతున్నట్లున్నావంటూ తెలిపాడు. కాగా సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్‌ ఐపీఎల్‌ కెప్టెన్లలో విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చకున్నాడు. 2016లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా ఎంపికైన వార్నర్‌ 2018 మినహాయించి అతని సారధ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌కు చేరుకోవడం విశేషం. ఇక ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లాడిన వార్నర్‌ 42.71 సగటుతో 5, 254 పరుగులు సాధించగా.. ఇందులో నాలుగు సెంచరీలు.. 48 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న కేకేఆర్‌తో ఆడనుంది.

చదవండి: 
'దూకుడుకు మారుపేరు.. అదే పంత్‌కు బలం'
ఐపీఎల్‌ 2021: సన్‌'రైజ్‌' అవుతుందా

A post shared by David Warner (@davidwarner31)

మరిన్ని వార్తలు