నేను, నా ఇద్దరు పిల్లలు.. వైరలవుతున్న రోహిత్‌ భార్య రితిక సెల్ఫీ

22 Apr, 2021 19:34 IST|Sakshi

చెన్నై: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భార్య రితిక సజ్దే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఓ సెల్ఫీ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సెల్ఫీలో రితిక, అమె భర్త రోహిత్‌, వారి గారాలపట్టి సమైరా ఫోటోకు ఫోజిచ్చారు. రితిక.. తన హబ్బీ రోహిత్‌ను మరో బిడ్డతో పోల్చుతూ "నా ఇద్దరు పిల్లలు(సమైరా, రోహిత్‌)" అంటూ క్యాప్షన్‌ జోడించింది. దీంతో ఈ సెల్ఫీ నెట్టింట తెగ వైరలవుతోంది. రితిక.. రోహిత్‌పై ప్రేమను ఈ సెల్ఫీ ద్వారా వ్యక్తపరుస్తుందని అభిమానులు తెగ ముచ్చటించుకుంటున్నారు. అందమైన చిన్న కుటుంబమని రోహిత్‌ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.  గతేడాది ఐపీఎల్‌ నుంచి తీరిక లేకుండా క్రికెట్‌ ఆడుతున్న హిట్‌ మ్యాన్‌.. సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో కలిసి జాలీగా గడుపుతుంటాడు.

A post shared by Ritika Sajdeh (@ritssajdeh)

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని 5 టైటిల్‌ల ఘనతను సొంతం చేసుకున్న రోహిత్‌.. వరుసగా మూడో టైటిల్‌ను నెగ్గి హ్యాట్రిక్‌ టైటిల్స్‌ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు. లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి సేన చేతిలో పరాభవం ఎదురయ్యాక, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన ముంబై.. మంగళవారం(ఏప్రిల్‌ 20) ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఓటమి రుచి చూసింది. దీంతో ముంబై ప్రస్తుతానికి రెండు విజయాలు, మరో రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతానికి ముంబై టాప్‌ స్కోరర్‌ కూడా రోహితే కావడం విశేషం. ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.  ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 23న (శుక్రవారం) చెన్నై వేదికగా జరుగనుంది.
చదవండి: విరుష్క జంటతో అజహరుద్దీన్‌‌..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు