తండ్రికి పాజిటివ్‌.. ఐపీఎల్‌ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు

28 Apr, 2021 15:38 IST|Sakshi

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్‌.. కామెంటేటర్‌ ఆర్‌పీ సింగ్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. తన తండ్రికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో బయోబబుల్‌ సెక్యూర్‌ను వదిలి ఫ్యామిలీకి సహాయంగా ఉండేందుకు వెళ్లాడు. ఆర్‌పీ సింగ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. సాధారణంగా ఆటగాళ్లతో పాటు కామెంటేటర్స్‌, లైవ్‌ మ్యాచ్‌లు టెలికాస్ట్‌ చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్‌  నెట్‌వర్క్‌ సిబ్బంది ఎవరైనా సరే నిబంధనల్లో భాగంగా బయోబబుల్‌ సెక్యూల్‌ ఉండేలా ఆంక్షలు విధించారు.

అయితే మంగళవారం ఆర్పీ సింగ్‌ తండ్రికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అతను ఐపీఎల్‌ 14వ సీజన్లో కామెంటేటర్‌ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ సమయంలో తన అవసరం నా ఫ్యామిలీకి ఉందని.. అందుకే తప్పుకుంటున్నట్లు ఆర్పీ సింగ్‌ తెలిపాడు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి  బయోబబుల్‌ సెక్యూర్‌ దాటి బయటికి వెళ్తే మళ్లీ అడుగుపెట్టే అవకాశం లేదు. ఇక ఆర్పీ సింగ్‌తో పాటు అజిత్‌ అగార్కర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆకాశ్‌ చోప్రా, నిఖిల్‌ చోప్రా, పార్థివ్‌ పటేల్‌, గౌతమ్‌ గంభీర్‌, సునీల్‌ గవాస్కర్‌, దీప్‌దాస్‌ గుప్తా తదితర మాజీ క్రికెటర్లు కామెంటేటర్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇక కరోనా ఉదృతమవుతున్న వేళ ఐపీఎల్‌ 14 సీజన్‌ నుంచి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స​ ఆటగాడు అశ్విన్‌ తప్పుకోగా.. ఇక విదేశీ ఆటగాళ్లలో రాజస్తాన​ నుంచి లివింగ్‌ స్టోన్‌, ఆండ్రూ టై, ఆర్‌సీబీ నుంచి కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా లీగ్‌ను వీడిన సంగతి తెలిసిందే.ఇక 2018లో ఆర్పీ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియా తరపున 14 టెస్టుల్లో 40 వికెట్లు, 58 వన్డేల్లో 69 వికెట్లు, 10 టీ20ల్లో 15 వికెట్లు తీశాడు.
చదవండి: అతని స్థానంలో ఆర్‌సీబీలోకి కొత్త ఆటగాడు..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు