అతని కెప్టెన్సీతో హ్యాపీగా లేరు : సెహ్వాగ్‌

25 Apr, 2021 14:32 IST|Sakshi

ముంబై: ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కు కెప్టెన్‌గా సంజూ సామ్సన్‌ చేయడం పట్ల ఆ జట్ట క్యాంపులో నిరూత్సాహం అలుముకుందని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. దాంతో ఆ జట్టు కలిసి కట్టుగా కనిపించడం లేదని పేర్కొన్నాడు సామ్సన్‌కు కెప్టెన్సీ ఇవ్వడం నచ్చకే అ జట్టులోని సభ్యులు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్నాడు. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం సాధించిన తర్వాత క్రిక్‌బజ్‌తో కొన్ని విషయాలను షేర్‌ చేసుకునే క్రమంలో ముందుగా ప్రజ్ఞాన్‌ ఓజా ఈ అంశాన్ని లేవనెత్తాడు.

రాజస్థాన్‌ జట్టులో 11 మంది కలిసి కట్టుగా ఫీల్డ్‌లో విజయం కోసం కృషి చేయడం లేదని, వ్యక్తిగత ప్రదర్శన, వ్యక్తిగత నిర్ణయాలతో ఎవరికి వారే అన్నట్లు ఉన్నారన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్‌.. ఓజా అభిప్రాయంతో ఏకీభవించాడు. ‘ ఇక్కడ సామ్సన్‌ ఒకవైపు, మిగతా వారు మరొకవైపు ఉన్నారు. జట్టులో సఖ్యత లేదు. సామ్సన్‌ను కెప్టెన్‌ చేయడం ఆర్‌ఆర్‌ క్యాంప్‌లో చాలామందికి ఇష్టం లేదు. అప్పటివరకూ తమతో ఉన్నవాడు సడెన్‌గా కెప్టెన్‌ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  

ఒక బౌలర్‌ బౌలింగ్‌ వేస్తున్నప్పుడు అతనితో కలిసి చర్చించాలి. బౌలర్‌పై బ్యాట్స్‌మన్‌పై ఎదురుదాడికి దిగినప్పుడు కెప్టెన్‌గా బాధ్యత ఉంటుంది. బౌలర్‌ వద్దకు వెళ్లి అతన్ని కంఫర్ట్‌ జోన్‌లోకి తీసుకురావాలి. ఇదేమీ సామ్సన్‌ చేయడం లేదు. నేను రిషభ​ పంత్‌లో ఈ తరహా విధానం చూశాను. ఇలా చేస్తే బౌలర్‌కు ఆత్మవిశ్వాసం వస్తుంది. అప్పుడు బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశమూ దొరకుతుంది. ఆర్‌ఆర్‌ డగౌట్‌లోని విదేశీ ఆటగాళ్లు కూడా సామ్సన్‌తో సరిగా కమ్యూనికేట్‌ కావడం లేదు. అసలు ఒక టీమ్‌గానే కనబడుటం లేదు’ అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. 

ఇక్కడ చదవండి: మీరు కావాల్సినంత నవ్వుకోండి.. నాకేంటి?: పొలార్డ్‌
మోర్గాన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా?

మరిన్ని వార్తలు