ఐపీఎల్‌ షెడ్యూల్‌ ఇదేనా!

7 Mar, 2021 11:20 IST|Sakshi

ఢిల్లీ: ఐపీఎల్‌ 14వ సీజన్‌కు సంబంధించి మ్యాచ్‌ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ఏప్రిల్‌ 9న మొదలై.. మే 30 వరకు జరగనుంది. కాగా 52 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. ఫైన‌ల్ మ్యాచ్ మే 30వ తేదీన జ‌ర‌గ‌నుంది.అయితే దీనిపై గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికి సంబంధించి వచ్చేవారం ఐపీఎల్‌ గవర్నింగ్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌తో పాటు వేదిక‌ల‌ను కూడా ఖ‌రారు చేయనున్నారు.

అయితే తొలుత ఒకే వేదిక‌పై ఐపీఎల్‌ను నిర్వహించాల‌నుకున్నారు.. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆరు వేదికలను ఖరారు చేసినట్లు తెలిసింది. అహ్మదాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూ ఢిల్లీ, కోల్‌కత, ముంబైలు ఉన్నాయి. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న వేళ ముంబైలో మ్యాచ్‌లు జరగడం కష్టమే. అయితే మ్యాచ్‌ వేదికలపై ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ధోని నేతృత్వంలోని సీఎస్‌కే జట్టు చెన్నై చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ను యూఏఈ వేదికగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
చదవండి:
తలైవా.. వెల్‌కమ్‌ టూ చెన్నై

'ఆ వ్యాఖ్యలు చేసుంటే నన్ను క్షమించండి'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు