సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ పునఃప్రారంభం

7 Jun, 2021 15:38 IST|Sakshi

ముంబై: కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ పునఃప్రారంభం కానుంది. భారత్‌లో కరోనా ఉధృతి తగ్గని కారణంగా ఐపీఎల్‌ సెకండాఫ్‌ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో జరగాల్సిన మిగతా 31 మ్యాచ్‌లను సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అలాగే ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను అక్టోబర్‌ 15న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కాగా, సెకండాఫ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా లేరా అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే విదేశీ ఆటగాళ్లు వచ్చినా, రాకపోయినా లీగ్‌ను మాత్రం కంటిన్యూ చేస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షడు రాజీవ్‌ శుక్లా ఇటీవలే స్పష్టం చేశారు.
చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్‌ వేరు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు