కేకేఆర్‌ బాయ్స్‌ మీరు సూపర్‌: షారుక్‌

22 Apr, 2021 14:31 IST|Sakshi
photo courtesy: Instagram

ముంబై: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడిన కేకేఆర్‌పై ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ఖాన్‌ ప్రశంసలు  కురిపించాడు. ఆండ్రీ రసెల్‌, దినేశ్‌ కార్తీక్‌, ప్యాట్‌ కమిన్స్‌లు ఆడిన తీరును కొనియాడాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కేకేఆర్‌ ఆటగాళ్లను కొనియాడుతూ ట్వీట్‌ చేశాడు. ‘కేకేఆర్‌ బాయ్స్‌ మీరు సూపర్‌.  మనం ఆడిన ఒక్క పవర్‌ ప్లేను మినహాయిస్తే మిగతా అంతా నిజంగా అద్వితీయం. వెల్‌డన్‌ బాయ్స్‌.  రసెల్‌,  కార్తీక్‌, కమిన్స్‌ల ప్రయత్నం బాగుంది. దీన్నే అలవాటు చేసుకోవాలి. మనం తిరిగి పుంజుకుంటాం’ అని షారుక్‌ ట్వీట్‌ చేశాడు. 

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో -చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. సీఎస్‌కే 18 పరుగుల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ విక్టరీ నమోదు చేసింది, చివర వరకూ పోరాడిన కేకేఆర్‌ 202 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ఓటమి తప్పలేదు.  కమిన్స్‌ 34 బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడ్డా జట్టును గెలిపిం​చ లేకపోయాడు. ఆఖరి వికెట్‌గా ప్రసిద్ధ్‌ కృష్ట రనౌట్‌ కావడంతో కేకేఆర్‌ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఇన్నింగ్స్‌ ముగించాల్సి వచ్చింది.  ఆండ్రీ రసెల్‌(54;22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌(40; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కమిన్స్‌(66 నాటౌట్‌; 34 బంతుల్లో 4 పోర్లు, 6 సిక్సర్లు)లు ధాటిగా బ్యాటింగ్‌ చేసి జట్టును గెలిపించినంత పని చేశారు. 

ఇక్కడ చదవండి: వారి మధ్య వార్‌లా మారిపోయింది.. ఏమీ చేయలేం: ధోని
IPL 2021: ఇదేం నో బాల్‌ సైరన్‌.. క్రికెటర్ల అసహనం!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు