IPL 2021 Qualifier 2: మమ్మల్ని ఎవరైనా తేలికగా తీసుకుంటారా?

13 Oct, 2021 09:57 IST|Sakshi
Photo Courtesy: IPL/BCCI

Shakib Al Hasan on KKR’s confidence level: ఐపీఎల్‌-2021 సీజన్‌ కరోనా కారణంగా వాయిదా పడే నాటికి ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండింట మాత్రమే విజయం.. పాయింట్ల పట్టికలో పట్టికలో ఏడో స్థానం... కానీ... సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా రెండో అంచె ప్రారంభమైన తర్వాత... సీన్‌ మారిపోయింది... వరుస విజయాలు.. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు గెలిచింది... ఎలిమినేటర్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వంటి మేటి జట్టును ఓడించి ఇంటి బాట పట్టించింది...

ట్రోఫీని ముద్దాడటానికి ఇప్పుడు రెండడుగుల దూరంలో ఉంది.. ఇదీ తాజా సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ట్రాక్‌ రికార్డు... మరి అలాంటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జట్టును ప్రత్యర్థి జట్టు తేలికగా తీసుకుంటుందా? అస్సలు కాదు కదా! కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ కూడా ఇదే మాట అంటున్నాడు. కాగా మాజీ చాంపియన్‌ బుధవారం షార్జా వేదికగా జరిగే క్వాలిఫైయర్‌-2లో ఢిల్లీ ​క్యాపిటల్స్‌తో తలపడబోతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆర్సీబీపై గెలుపొంది క్వాలిఫైయర్‌-2కు అర్హత సాధించిన తర్వాత షకీబ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటి వరకు ఏవిధంగానైతే ముందుకు దూసుకువచ్చామో.. ఇక ముందు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతాం. యూఏఈకి వచ్చిన తర్వాత మేము ఒక్కో సవాలును దాటుకుంటూ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాం. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నాం. ఏ జట్టు కూడా మమ్మల్ని ఇకపై తేలికగా తీసుకోలేదు’’అంటూ కేకేఆర్‌ వెబ్‌సైట్‌తో వ్యాఖ్యానించాడు.

ఇక కీలక మ్యాచ్‌లో ఒత్తిడి సహజమన్న షకీబ్‌... ప్రొఫెషనల్‌ ప్లేయర్‌గా దానిని ఎలా అధిగమించాలో తమకు తెలుసునన్నాడు. ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన సునిల్‌ నరైన్‌పై షకీబ్‌ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్‌ విజయంలో తన వంతు పాత్ర కూడా పోషించడం సంతోషంగా ఉందన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 6 బంతుల్లో 9 పరుగులు చేసిన షకీబ్‌... కేకేఆర్‌ విజయంలో కీలకంగా మారాడు.

చదవండి: Daniel Christian: ఆర్సీబీని ముంచేశారు కదరా; ప్లీజ్‌.. నా భార్యను వదిలేయండి!

మరిన్ని వార్తలు