విరాట్‌ కోహ్లి తర్వాత శిఖర్‌ ధవన్‌

30 Apr, 2021 17:57 IST|Sakshi
Photo Courtesy: BCCI/PTI

అహ్మదాబాద్‌:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బ్యాటింగ్‌లో అలరిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ మరో ఘనతను నమోదు చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ధవన్‌ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. గురువారం కేకేఆర్‌ జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులతో మెరిసిన ధవన్‌.. ఇప్పటివరకూ 311 పరుగుల్ని సాధించాడు. ఫలితంగా ఓవరాల్‌ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇప‍్పటివరకూ రెండో స్థానంలో ఉన్న సీఎస్‌కే ఆటగాడు సురేశ్‌ రైనాను వెనక్కినెట్టాడు. ప్రస్తుతం ధవన్‌ 5,508 పరుగులతో రెండో స్థానానికి ఎగబాకాడు. అదే సమయంలో కోహ్లి తర్వాత ఐపీఎల్‌లో 5,500 పరుగుల మార్కును చేరిన రెండో ఆటగాడిగా ధవన్‌ నిలిచాడు. సురేశ్‌ రైనా 5,489 పరుగులతో మూడో స్థానానికి పడిపోయాడు. 

 ఐపీఎల్‌లో భాగంగా  గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై 7 వికెట్లతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది.  అనంతరం పృథ్వీ షా (41 బం తుల్లో 82; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో మరో 21 బంతులు మిగిలి ఉండగానే... ఢిల్లీ 16.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసి గెలుపొందింది. శిఖర్‌ ధావన్‌ (47 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. 

ఇక్కడ చదవండి: స్వదేశానికి వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నాం: మ్యాక్సీ
‘బుమ్రా.. బ్రేక్‌ త్రూ యాప్‌ లాంటివాడు’

మరిన్ని వార్తలు