'గోపాల్‌.. నా కంటే నువ్వే బాగా వేశావు'

22 Apr, 2021 16:17 IST|Sakshi
Courtesy : Rajasthan Royals Twitter

ముంబై: రాజస్తాన్‌ రాయల్స్‌​ ఆటగాడు శ్రేయాస్‌ గోపాల్‌ బుమ్రా, హర్భజన్‌, అశ్విన్‌ల బౌలింగ్‌ యాక్షన్‌ను ఇమిటేట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌ 14వ సీజన్‌ సందర్భంగా రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది. నేడు ఆర్‌సీబీతో జరగనున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ అమీతుమి తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో  శ్రేయాస్‌ గోపాల్‌ ప్రాక్టీస్‌ సమయంలో తన చర్యలతో జట్టు ఆటగాళ్లను ఎంటర్‌టైన్‌ చేశాడు. ముందుగా బుమ్రాను అనుకరించిన అతను.. అచ్చం అతని బౌలింగ్‌ యాక్షన్‌ను దింపేశాడు. ఆ తర్వాత అశ్విన్‌ బౌలింగ్‌ను అనుకరించేందుకు ప్రయత్నించాడు. అయితే శ్రేయాస్‌ లెగ్‌ స్పిన్నర్‌ కావడంతో అశ్విన్ ఆఫ్‌స్పిన్‌‌ బౌలింగ్‌ యాక్షన్‌ను సరిగా చేయలేకపోయాడు.

అయితే భజ్జీ విషయంలో మాత్రం గోపాల్‌ తన టైమింగ్‌ను తప్పలేదు. లెగ్‌ స్పిన్నర్‌ అయిన అతను భజ్జీ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను అచ్చం అతని లాగే దింపి అలరించాడు. ఆ తర్వాత తాను బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ను అతనికి చూపించగా.. నా బౌలింగ్‌ను నా కంటే బాగా నువ్వే వేశావు... సూపర్‌ ఇమిటేషన్‌ అని చెప్పినట్లు గోపాల్‌ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్‌ రాయల్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇక 2018 నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌తో కొనసాగుతున్న అతను లెగ్‌ స్పిన్నర్‌గా ఆ జట్టుకు కీలకంగా మారాడు. అంతకముందు గోపాల్‌ 2014- 2018 వరకు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. బుమ్రా, హర్భజన్‌లతో​ కలిసి ఆడిన గోపాల్‌ వారి బౌలింగ్‌ యాక్షన్‌ను ఇమిటేట్‌ చేసి వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. కాగా ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఫేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో 1 విజయం.. రెండు ఓటములతో ఏడో స్థానంలో నిలిచింది. నేటి మ్యాచ్‌లో పటిష్టమైన ఆర్‌సీబీని ఎదుర్కోనున్న రాజస్తాన్‌ వారిని ఏ మేర నిలువరిస్తుందో చూడాలి.
చదవండి: వైరల్‌: భజ్జీ కాళ్లు మొక్కిన రైనా.. వెంటనే

రసెల్‌.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు