క్యాచ్‌ పట్టినప్పుడల్లా తొడగొట్టావు.. మ్యాచ్‌ తర్వాత నీ పరిస్థితి

16 Apr, 2021 17:06 IST|Sakshi
Courtesy: IPL Twitter‌

ముంబై: టీమిండియా క్రికెటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ను తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు. విషయంలోకి వెళితే.. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా గురువారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌లో విఫలమైనా మంచి ఎంటర్‌టైన్‌ అందించాడు. రాజస్తాన్‌ బ్యాటింగ్‌ సమయంలో ఆ జట్టుకు చెందిన ముగ్గురు బ్యాట్స్‌మన్‌ క్యాచ్‌లు ధావన్‌ తీసుకున్నాడు. క్యాచ్‌ తీసుకున్న ప్రతీసారి తొడగొట్టి మీసం మెలేస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చినవారిలో సంజూ సామ్సన్‌, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబేలు ఉన్నారు.

అయితే ధావన్‌ చర్యలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. దీంతో అయ్యర్‌ ధావన్‌నుద్దేశించి ఎర్రగా వాచిన తొడ ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ధావన్‌ భయ్యా.. క్యాచ్‌లు పట్టినప్పుడల్లా.. తొడ గొట్టావు.. బహుశా మ్యాచ్‌ తర్వాత నీ పరిస్థితి ఇలా ఉంటుందేమో అంటూ చమత్కారంగా క్యాప్షన్‌ జత చేశాడు. అయ్యర్‌ షేర్‌ చేసిన ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ సమయంలో పంత్‌ రనౌట్‌ అయినప్పుడు పరాగ్‌ చేసిన డ్యాన్స్‌ కూడా నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంది.


ఇక రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ ఉనాద్కట్‌ ధాటికి టాప్‌ ఆర్డర్‌ విఫలం కాగా.. కెప్టెన్‌ పంత్‌ హాఫ్‌ సెంచరీతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరంభంలో ఢిల్లీ బౌలర్ల దాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే మిడిలార్డర్‌లో మిల్లర్‌(63)తో పాటు ఆఖర్లో క్రిస్‌ మోరిస్‌( 36, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో శ్రేయాస్‌ అయ్యర్‌ భుజం గాయం బారీన పడిన సంగతి తెలిసిందే. రిపోర్ట్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో ఇంగ్లండ్‌ సిరీస్‌తో పాటు ఐపీఎల్‌ 14వ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ మేనేజ్‌మెంట్‌ అయ్యర్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. 
చదవండి: పృథ్వీ షాను ఔట్‌ చేయడానికి ఆ ప్లాన్‌ ఉపయోగించా
‘అశ్విన్‌కు బౌలింగ్‌ ఎందుకు ఇవ్వలేదో అడుగుతా’

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు