సూపర్‌ క్యాచ్‌ పట్టాడు.. కానీ నోబాల్‌ అయిపోయింది

13 Oct, 2021 21:20 IST|Sakshi
Courtesy: IPL Twitter

Shubman Gill Stunning Catch But Umpire Gives No Ball.. ఐపీఎల్‌ 2021లో కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అది నో బాల్‌ కావడంతో ప్రత్యర్థి బ్యాటర్‌ బతికిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ 17వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్‌ వరుణ్‌ చక్రవర్తి వేయగా.. ఓవర్‌ 4వ బంతిని హెట్‌మైర్‌ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అయితే బౌండరీ లైన్‌ వద్ద ఉన్న గిల్‌ ముందుకు పరిగెత్తి డైవ్‌ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో హెట్‌మైర్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. గిల్‌ క్యాచ్‌ పట్టినప్పటికీ అంపైర్‌కు నోబాల్‌ అనే అనుమానం వచ్చింది. వెంటనే రిప్లై చూడగా.. అందులో వరుణ్‌ చక్రవర్తి ఫ్రంట్‌ ఫుట్‌ క్రీజు దాటి ముందుకు వచ్చినట్లు కనిపించింది. అయితే బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద అంపైర్‌ నోబాల్‌ ఇవ్వడంతో కేకేఆర్‌కు నిరాశ మిగిలింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్‌ ధవన్‌ 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ 30 పరుగులు చేశాడు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 2, ఫెర్గూసన్‌, శివమ్‌ మావి చెరో వికెట్‌ తీశారు.

చదవండి: T20 World Cup 2021: మెంటార్‌గా ధోని పని ప్రారంభించాడు.. అందుకే శార్దూల్‌ 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు